– నిందుతులను కఠినంగా శిక్షించాలి…
– గోదావరిఖని బార్ ఆసోషియేషన్ అధ్యక్షుడు మేడ చక్రపాణి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ట ప్రభుత్వాలు విఫలమవుత్నాయని గోదావరిఖని బార్ అసోసి యేషన్ అధ్యకుడు మేడ చక్రపాణి ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలను నిరస్తూ గోదావరిఖని బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని కోర్టు నుండి చౌరస్తా వరకు శనివారం ర్యాలి నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్యక్షులు మేడ చక్రపాణి మాట్లాడుతూ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో మహిళ పై క్రూరం అత్యాచారం చేసి హత్య చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరవాత కూడా మహిళలు అందులో ముఖ్యంగా దళిత మహిళల పై జరుగుతున్న దాడులు గర్హనీయమని పేర్కొన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని తెలిపారు. నిండుతుల పై కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం బాధితులను ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మహిళా అధికార ప్రతినిధి చెలికల పద్మజ, ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్, క్రీడా సంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు భూమయ్య, న్యాయవాదులు పూర్మ శ్రీనివాస్, మురళీధర్ యాదవ్, జూపాక వెంకటేశ్వర్లు, పులిపాక రాజ్ కుమార్, భారతి చౌహన్, కొమురెల్లి, ప్రవీణ్ కుమార్, సతీష్, గాజుల రాజ్ కుమార్, ఉశశ్రీ, వరలక్ష్మి, అవినాష్, బోయిన శ్రీనివాస్, అంజయ్య నాతరి, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.