Home తెలంగాణ అంసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రస్తావించడం హర్షనీయం

అంసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రస్తావించడం హర్షనీయం

590
0
Thanking to MLA

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కృతజ్ఞతలు.
– కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో మాట్లాడాలని వినతి
– తెలంగాణ రీజియన్ సింగరేణి కార్మిక సంఘం అధ్యకుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 10: సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున పలు సమస్యల పట్ల స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షనీయమని తెలంగాణ రాష్ర్ట సమితి కార్మిక విభాగం అనుబంధ తెలంగాణ రీజియన్ సింగరేణి కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు కట్కూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సంఘం కేంద్ర అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ప్రధాన కార్యదర్శి అన్వర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కోమళ్ల శ్రీనివాస్ లు కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లో  దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారి తరుపున రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసెంబ్లీలో గొంతు విప్పడం హర్షనీయమని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ లాగానే కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ  కాంట్రాక్టు కార్మికుల తరుపున అసెంబ్లీలో తమ గొంతును వినిపించాలని కోరారు. అసెంబ్లీలో అందరు శాసన సభ్యులు ప్రస్తావించి చర్చ జరిగేలా చేస్తే ముఖ్యమంత్రి తప్పకుండా స్పందిస్తారని తెలిపారు. ఈ చర్యతో సింగరేణి యాజమాన్యం పై ఒత్తిడి పెరిగి కాంట్రాక్టు కార్మికులకు రావలసిన హక్కులను వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తుందని పేర్కొన్నారు. తద్వార కాంట్రాక్ట్ కార్మికులకు మేలు జరుగతుందని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అంతా  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల కన్నీటిని తుడవాలని విజ్ఞప్తి చేసారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంతో పాటు, ప్రమాద బీమా సౌకర్యం, కార్మికులకు వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని తెరాస కార్మిక విభాగం అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ రీజినల్ సింగరేణి కార్మిక సంఘం తరుపున కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here