Home తెలంగాణ హరితహారంను వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక

హరితహారంను వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక

358
0
Review Meeting
District Collector K.Shashanka speaking at review meeting

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ సెప్టెంబర్ 9: హరిత హారం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి,  ఫారెస్ట్ ఆఫిసర్, జిల్లా పంచాయతి అధికారి,  కలిసి హరిత హారం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు క్రాస్ చెక్ చేసుకోవాలని, సయోధ్య ప్రకటన అధికారులు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. మండలాలు, గ్రామాలలో ఖాళీ ఉన్న ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. గ్రామ పంచాయతి వారీగా ప్లాంటేషన్ చెక్ చేసుకోవాలని అన్నారు. యాదాద్రి మోడల్ గా పల్లె ప్రకృతి వనాల మీద దృష్టి పెట్టాలని అన్నారు. నేషనల్ హైవే రోడ్డులు, రాజీవ్ రహదారులు, చొప్పదండి,  వైపు స్థలాన్ని బట్టి ఫిట్టింగ్ కానీ, ప్లాంటేషన్ కానీ త్వరితగతిన మొక్కలను నాటాలని అన్నారు. వ్యవసాయ, పల్లె ప్రకృతి వనం, బండు ప్లాంటేషన్, అర్బన్ ఏరియాలలో, రూరల్ ఏరియాలలో, ఎస్సారెస్పి వద్ద ప్లాంటేషన్ అయ్యే విధంగా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలానికి ఒక యాదాద్రి మోడల్, మంకీ ఫుడ్ కోర్టు పూర్తి అయ్యే విధంగా చూడాలని, జియో ట్యాగింగ్ చేయాలని అన్నారు. సరిహద్దుల నుండి రోడ్లకు ఇరువైపులా 2 వరుసలు చెట్లు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ , ప్రభుత్వ స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. గుర్తించిన ఎకరాలలో ప్రకృతి వనంకు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రతి గ్రామానికి 5 కిలో మీటర్ల దూరం వరకు మొక్కలు నాటాలని ఆయన అన్నారు. హరిత హారంలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్లాంటేషన్ చేయాలని, టార్గెట్ పూర్తి చేయని వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎ. నరసింహా రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా అటవీ అధికారి చైతన్య,  డి.ఆర్.డి.ఏ.వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here