– పక్కాగా, పారదర్శకంగా కొత్త రెవెన్యూ చట్టం
– కొత్త చట్టంలో భూవివాదాలకు చెక్
– నూతన రెవెన్యూ చట్టానికి జై కొడుతున్న కర్షక లోకం
– రెవెన్యూ చట్టానికి మద్ధతుగా ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
– పెద్దపల్లి ఎంపి వెంకటేశ్‌నేత
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 27: రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ఇందులో భాగంగానే రైతులకు మేలు చేసేలా నూతన రెవెన్యూ చట్టం తీసుక వచ్చారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత అన్నారు.
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రామగుండం నియోజవర్గంలోని రైతులతో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. రామగుండం బైపాస్ రోడ్డు వద్ద అంతర్గాం, పాలకుర్తి మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో వచ్చిన ర్యాలీని జెండా ఊపి ప్రారంబించారు. ఈ ర్యాలి రామగుండం బి పవర్‌హౌజ్, మేడిపల్లి సెంటర్,ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం, గోదావరిఖని ప్రధాన చౌరస్తా మీదుగా ఎల్బీ స్టేడియం వరకు సాగింది. ర్యాలీలో కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల నినాదలు చేసారు. ర్యాలీలో అడుగడుగున మహిళలు, ప్రజలు ఎమ్మెల్యే చందర్‌కు స్వాగతం పలికి కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు.
అనంతం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో రామగుండం ఎమ్యెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపి వెంకటేశ్‌నేత మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు రైతుల్లో ఆనందం నింపిదన్నారు. ఇది రైతులకు ఒక వరం లాంటిదన్నారు. ఈ చట్టం ఎంతో పారదర్శకంగా రైతుల భూముల కష్టాలను పూర్తి స్థాయిలో రూపు మాపేందుకు, భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని కర్షకలోకం స్వాగతిస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన చట్టాన్ని అమలు చేస్తున్నరన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం చారిత్మకమైనదని, రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. దళారి వ్యవస్థ నుండి రైతులను శాశ్వతంగా దూరం చేసే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపోందించండం జరిగిందన్నారు. ఒకే రోజు రిజిస్టేషన్, పాస్ బుక్, మ్యుటేషన్ అమలు కానుందన్నారు. రాష్ట్రంలో ప్రతి భూమిని ఆన్‌లైన్‌లోకి మార్చడం జరుగుతుందన్నారు.
రైతుల పక్షపాతి అయిన సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా ఉంటూ వారి కళ్లలో అనందం నింపుతున్నారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంతో మొదలుకుని పంట కోనుగోలు వరకు రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసి, జెన్ -కో స్థలాల్లో ప్రజలు తమ ఇళ్లను నిర్మాణం చేసుకుని 50 ఏళ్లుగా నివాసాలుంటున్నారని, వారి గతంలో పట్టాలు మంజూరు అయినప్పటికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండా పోయయాన్నారు. ఈ ప్రాంతంలోని స్థలాలకు యాజమాన్య హక్కుతో పాటు విక్రయాల చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వంను ఓప్పించి జివో 76 అమలు చేయించండం జరిగిందన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసి, జెన్-కో స్థలాల్లో నివాసాలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ధరణీ పోర్టల్‌లో అవకాశం కల్పించాలని సిఎం కేసీఆర్ కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమామే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సిఎం కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజలు కతజ్ఞలై ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపిపి దుర్గం విజయ, వాల్వ అనసూర్య, జడ్పీటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపిలు మట్ట లక్ష్మీ-మహేందర్ రెడ్డి, ఎర్రం స్వామి, సర్పంచ్లు ధరణి రాజేష్, శ్రీనివాస్, సతీష్, బండారి ప్రవీన్ కుమార్, ధరణి కష్ణ, కో అప్షన్ సభ్యులు గౌస్‌పాషా పాల్గొనగా…
రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు పాతపెల్లి లక్ష్మీ-ఎల్లయ్య, సాగంటి శంకర్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్.వి.రమణరెడ్డి, కల్వచర్ల కష్ణవేణి-భూమయ్య, కాల్వ స్వరూప-శ్రీనివాస్, వెగోళపు రమాదేవి -శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, ర్యాకం లత – వేణు, శంకర్ నాయక్, బాదె అంజలి-భూమయ్య, తాళ్ల అమతమ్మ-రాజయ్య, నీల పద్మ-గణేష్, కన్నూరి సతీష్ కుమార్, అల్జీన్ పాతిమా-సలీం బెగ్, మంచికట్ల దయాకర్, ఇంజపూరి పులేందర్, అయిత శివకుమార్, దోంత శ్రీనివాస్, జంజర్ల మౌనిక-రాజు, పాముకుంట్ల భాస్కర్, జెట్టి జ్యోతి-రమేష్, బాల రాజ్ కుమార్, మేకల సదానందం, కోమ్ము వేణుగోపాల్, మహలక్ష్మి-తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు తానిపార్తి విజయలక్ష్మి-గోపాల్ రావు, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీంబాను-జహీద్ పాషా, చెరుకు బుచ్చిరెడ్డి, మహ్మద్ రఫీ, పాల్గొనగా,
నాయకులు బోమ్మగాని తిరుపతిగౌడ్, తిరుపతి నాయక్, మూల విజయారెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ, మారుతి, దీటి బాలరాజ్, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేష్, అచ్చెవేణు, పీచర శ్రీనివాస్, మోతుకు దేవరాజ్, చెలకపల్లి శ్రీనివాస్, బోడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, పి.టి స్వామి, బోమ్మగాని తిరుపతిగౌడ్, ఆడప శ్రీనివాస్, తంగెడ అనిల్ రావు, మాదాసు అరవింద్, ఇరుగురాళ్ల శ్రావణ్, మేకల అబ్బాస్, సాగర్, శ్రీకాంత్ అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు..