Home తెలంగాణ టిఆర్ఎస్ తోనే సాగ‌ర్‌ నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మగ్రాభివృద్ధి సాధ్యం…

టిఆర్ఎస్ తోనే సాగ‌ర్‌ నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మగ్రాభివృద్ధి సాధ్యం…

863
0
MLA Korukanti Chander speaking during the election campaign
MLA Korukanti Chander speaking during the election campaign

– అభ్య‌ర్థి ఖ‌రారుతో ఊపందుకున్న ప్ర‌చారం…
– కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
హాలియా (నాగార్జున‌సాగ‌ర్‌), మార్చి 30ః తెలంగాణ రాష్ట్ర స‌మితితోనే నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మ్ర‌గాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

MLA Korukanti Chander with TRS candidate Nomula Bhagat
MLA Korukanti Chander with TRS candidate Nomula Bhagat

టిఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు కావ‌డంతో ప్ర‌చారం ఉపందుకుంది. టిఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగ‌త నోముల న‌ర్సింయ్య కుమారుడు నోముల భ‌గ‌త్ కు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పార్టీ బి-ఫామ్ అంద‌జేసారు. నామినేష‌న్ కూడా వేయడంతో పార్టీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహం నెల‌కొంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగళవారం అనుముల గ్రామ 7వ వార్డు లో గడప గడపకు గులాబీ సైన్యం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్ర‌తి ఇంటికి వెళుతూ ప్ర‌తి ఒక్క‌రిని క‌లుస్తూ కారు గుర్తుకు ఓటేసి నోముల భ‌గ‌త్‌ను ఎమ్మేల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.

TRS Gadapa Gadapa Election Campaign
TRS Gadapa Gadapa Election Campaign

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్ మాట్లాడుతూ…ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోనే రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ది చెందుతుంద‌ని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. దివంగ‌త నేత నోముల న‌ర్సింయ్య ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌రిచార‌ని, ఆ అభివృద్ధిని కొన‌సాగించే బాధ్య‌త వారి వార‌సుడు నోముల భ‌గ‌త్ తీసుకున్నార‌ని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజ‌క‌వ‌ర్గం మ‌రింత‌గా అభివృద్ధి చేందేందుకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ మద్దతుగా నిలవాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చంద‌ర్ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మాలగిరెడ్డి లింగారెడ్డి, పార్వతి శంకరయ్య, సుధాకర్, దుర్గారావు, ప్రసాద్, వెంకటరెడ్డి, సైదులు అధిక సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here