Home తెలంగాణ కంటిన్యూస్ మైనర్ పునః ప్రారంభించిన జియం

కంటిన్యూస్ మైనర్ పునః ప్రారంభించిన జియం

511
0
GM Speaking at 11 Incline
RG-I GM K.Narayana speaking at 11 Incline

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 14: ఈ రోజు అర్జీ-1 ఏరియా జిడికే 11 ఇంక్లైన్ లోని కంటిన్యూస్ మైనర్ ను జియం కె నారాయణ పునః ప్రారంబించారు. సోమవారం రోజున కంటిన్యూస్ మైనర్ కు పూజా కార్ర క్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా జియం కె. నారాయణ గారు మాట్లాడుతూ 3 వ దఫా ఒవర్ హాలింగ్ పనులు పూర్తి చేసుకొని పునః ప్రారంభం చేయబోయే కంటిన్యూస్ మైనర్, రూఫ్ బొల్టర్, రామ్ కార్, ఫీడర్ బ్రేకర్, ఎఫ్ బెల్టన్ యంత్రాలను 1సిమ్ లోకి తిరిగి పంపిచటకు సిద్దం చేయటం జరిగిందని చెప్పారు. ఈ రోజు 3వ ఇంటెక్ సిఎం వెహికిల్ మార్చింగ్ ప్రవేశ మార్గం ద్వారా 1 సిమ్ లోపలికి పంపడం జరుగుతుందని పేర్కొన్నారు.

Re launching
GM conducted pooja programme

సింగరేణి లోనే జీడికే 11 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్ అత్యదిక విజయాలు సాధించాయని తెలిపారు. కంటిన్యూస్ మైనర్ ను 2009 లో జీడికే 11 ఇంక్లైన్ లో ప్రారంబించటం జరిగిందని తెలిపారు. జెమ్ కొ కంపెనీ జీడికే 11 ఇంక్లైన్ లో బొగ్గు తీయుటకు గాను సింగరేణి తో ఒప్పందం చేసుకోవటం జరిగిందని, జెమ్ కొ కాంట్రాక్ట్ ద్వారా మొదటి 5 సంవత్సరాలకు గాను 20 లక్షల టన్నుల లక్ష్యం కు గాను 23.07లక్షల టన్నుల సాధించామని తెలిపారు. తరువాత 4 సంవత్సరాలకు గాను 16 లక్షల టన్నుల లక్ష్యంకు గాను 20.07 లక్షల టన్నుల సాధించిందని పేర్కొన్నారు. అత్యదిక ఉత్పత్తి ఒక్క రోజుకు గాను 5010 టన్నులు, ఒక్క నెలకు గాను 81,000 టన్నులు సాధించి సింగరేణి లోనే జీడికే 11 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్ ముఖ్య భూమిక పోషించి పలు అవార్డులను సైతం సాధించిందని తెలిపారు.

ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా కలిసి పనిచేసి ఉత్పత్తిని సాధించారని తెలిపారు. ఉత్పత్తి మరియు ఉత్పాదకత పనులను వేగవంతంగా చేపట్టాలని, రక్షణ చర్యలను పాటిస్తూ ఉత్పత్తి పనులను చేపట్టాలని, కంటిన్యూస్ మైనర్ ద్వారా ఇంతటి విజయాలు సాధించినందుకు అధికారులకు, షిఫ్ట్ ఇంచార్జ్ లకు, జెమ్ కొ ఉద్యోగుల టిమ్ కు మరియు సింగరేణి ఉద్యోగులను జయం అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, ఏరియా ఇంజనీర్ బెనర్జీ బెంజ్ మెన్, 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, అండర్ గ్రౌండ్ మైన్స్ హెడ్ (జెమ్ కొ) ఎం.డి. సురేశ్ కుమార్, మేనేజర్ నెహ్రూ, ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్, 1 సిమ్ ఇంచార్జ్ సురేశ్, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, గ్రూప్ ఇంజనీరు రాందాస్, సర్వే అధికారి నారాయణ, జెమ్ కొ ప్రాజెక్టు మేనేజర్ నరసింహ రావు, సంక్షేమాధికారి రవీందర్, సెక్యూరిటి అధికారి వీరారెడ్డి మరియు ఇతర అధికారులు, జెమ్ కొ ఉద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here