– పర్యాటక కేంద్రంగా గోదావరినది తీరం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం పత్రినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 19, కాళేశ్వర ప్రాజెక్టు ఓ అద్భుతమని, తూర్పున పారే గోదావరినదిని పడమరకు మార్చి గోదావరినది నిండుకుండలా మార్చి తెలంగాణ దశమార్చిన జలప్రధాత సిఎం కేసీఆర్ అని అన్నారు. శనివారం గోదావరినది వద్ద 5 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రోటింగ్ జెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీటలు వారిని భూములు, ఎండిన గోదారినదిని చూశామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం సఫలంతో గోదావరినదికి జలకళ సంతరించుకుందన్నారు. నిండుకుండగా మారిన గోదావరినదిపై పడవల పోటీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
గోదావరి నది తీరాన్ని పర్యటక కేంద్రంగా మార్చాలని హరితగెస్ట్ హౌజ్, పడవల ఏర్పాటు చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లను కోరానని, ఈ క్రమంలోనే గోదావరి తీర ప్రాంతానికి పడవలు రావడం జరిగిందన్నారు.
తెలంగాణలో ఎక్కడలేని విధంగా గోదావరినదిలో బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డు, రేస్యూ ఆపరేషన్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు అహ్లదకరంగా ఉండేందుకు, గోదావరినదిని విక్షించేందుకు ప్లోటింగ్ జెట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, సాగంటి శంకర్, అడ్డాల గట్టయ్య, మేకల సదానందం, పామకుంట్ల భాస్కర్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, రఫీక్, జహీద్ పాషా, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేష్, అచ్చె వేణు, నూతి తిరుపతి, మోతుకు దేవరాజ్, గోలివాడ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.