Home తెలంగాణ వివాహితను రక్షించిన లేక్‌పోలీసులు

వివాహితను రక్షించిన లేక్‌పోలీసులు

495
0
Lake police protecting married women from suicide

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 14: భర్త మద్యానికి బానిసగా మారి ఇళ్ళుగడిచేందుకు కనీసం నిత్యావసర వస్తువులను సైతం తీసుకరాక పోవడమే కాకుండా తరచూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ, చిత్రహింసలకు పాల్పడుతుండంతో విరక్తి చెంది ఆత్మహత్యాకు ప్రయత్నించిన వివాహితను సోమవారంనాడు లేక్‌అవుట్‌పోస్ట్‌ పోలీసులు రక్షించారు.

వివరాల్లోకి వెళితే కరీంనగర్‌లోని గౌతమినగర్‌ ప్రాంతానికి చెందిన వివాహిత అమ్మిగ్ల రజిత (40), తన భర్త మద్యానికి బానిసై కనీసం ఇంట్లోకి నిత్యావసరవస్తువులను కూడా తీసుకరాకుండా గత 20సంవత్సరాల నుండి తరచూ మానసికంగా వేధించడం, శారీరకంగా హింసిస్తుండటం, పెళ్ళీడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నా పట్టించు కోకపోవడంతో జీవితంపై విరక్తిచెంది సమీపంలోని మానేరు జలాశయం వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకోబోయింది. గస్తీలో ఉన్న కానిస్టేబుళ్ళు ఆమెను గుర్తించి వివరాలు ఆరా తీశారు. వెంటనే ఎస్‌ఐకి సమాచారం అందించారు. వివాహిత సోదరుడు, మరిదిని పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

మానేరు జలాశయం వద్దకు ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన వారిని లేక్‌పోలీసు రక్షించిన సంఖ్య నేటితో 103కు చేరుకుంది. ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రాణాలను రక్షించిన ఎస్‌ఐ శ్రీనాథ్‌, కానిస్టేబుళ్ళు వై. శ్రీనివాస్‌, రమణను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డును ప్రకటించారు.

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
– కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి

Commissioner
Commssioner V.D. Kamalasan Reddy

వివిధ రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు ప్పాడటం, యత్నించడం సరైందికాదని, ప్రతి సమస్యకు పరిష్కారమార్గాలు ఉన్నాయని, ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతూ సమస్యను పరిష్కరించుకోవాని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి అన్నారు. తమపరిధిలో సమస్యుల పరిష్కారం కాకపోయినట్లయితే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ అర్ధవంతమైన జీవితాన్ని ఆత్మహత్యకు పాల్పడి అర్ధాంతరంగా ముగించడం విచారకరమని చెప్పారు. ఆత్మహత్య నివారణలో భాగంగా ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను పోలీస్‌శాఖ కొనసాగిస్తున్నదని చెప్పారు. ప్రజకు రక్షణ/భద్రత కల్పించేందుకు పోలీస్‌శాఖ శ్రమిస్తోందని, అన్నివర్గాలకు చెందిన ప్రజులు పోలీసుల సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజులు నేరుగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరంలేదని, ఫోన్‌కాల్‌, వాట్సాప్‌, హాక్‌ఐ యాప్‌ ద్వారా సమాచారం అందించినా పోలీసు సత్వరం స్పందించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ కలిగిఉన్న ప్రతిపౌరుడు హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నగరం తర్వాత కరీంనగర్‌ కమిషనరేట్‌లోనే ఎక్కువమంది ప్రజులు హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఒక్కమీటనొక్కితే పోలీసు సేమ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని అన్నివర్గాల ప్రజులు గుర్తించాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here