Home తెలంగాణ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

532
0
Jagtial SP

జగిత్యాల; లాక్ డౌన్ నేపద్యంలో నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత ఎవరూ ఇండ్లలో నుండి బయటకు రావద్దని జిల్లా ఎస్పీ శసింధు శర్మ కోరారు.

కరోనా వైరస్ కేవలం స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే నివారణ సాధ్యమని అందువల్ల ప్రజలంతా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దని సూచించారు. లాక్ డౌన్ నేపధ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.

634 వాహనాలు సీజ్

ఇందులో భాగంగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 634వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా సుమారు 2831 వాహనాలకు జరిమానా విధించామని, ఉల్లంఘనలకు సంబంధించి 154 కేసులు నమోదు చేశామని ఇందులో 578 మంది పై కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు.

586లీటర్ ల మద్యం సీజ్

జిల్లా వ్యాప్తంగా 586లీటర్ ల మద్యం సీజ్ చేయడం జరిగిందని, దీని విలువ 2.93లక్షలని ఎస్పీ తెలిపారు.

5 చెక్ పోస్టులు, 26 పికెటింగ్ పాయింట్స్

జగిత్యాల జిల్లా బార్డర్స్ కు సంబంధించి 5 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న పట్టణాలో,గ్రామాల్లో 26 పికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క చెక్ పోస్ట్,పికెటింగ్ పాయింట్ లో నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల పై కేసులు నమోదు

కరోనా వైరస్ పై సామాజిక మధ్యమాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ,ఈయొక్క పోస్ట్ ల ద్వారా ఒకరిని ఒకరు దూషించు కుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి ని గుర్తించి 15 కేస్ లు నమోదు చేయడం జరిగిందని వీరి పై ఐపీసీ సెక్షన్స్,డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005,ఎపిడేమిక్ ఆక్ట్ 1897,ఐటీ ఆక్ట్ ప్రకారం పోస్ట్ పెట్టిన వ్యక్తి పై, ఆ గ్రూప్ అడ్మిన్ పై ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి సాక్షాల గురించి వారి యొక్క సెల్ ఫోన్స్ సీజ్ చేసి వారిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.

ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలో నిజానిజాలు తెలియకుండా ఫార్వర్డ్ చేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు.

హోం క్వారంటేన్ వున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా

జిల్లాల పరిధిలో విదేశాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి జాబితా జిల్లా పోలీస్ అధికారుల వద్ద వుందని వైద్య, పోలీస్ , రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త బృందాలు గా ఏర్పడి విదేశాల నుండి వచ్చిన వారిని ప్రతిరోజు తనిఖీ చేయడం జరుగుతుందని వారు బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటి వరకు హోమ్ క్వారంటేన్ సంబంధించి జిల్లా లో 24 కేస్ లు నమోదు చేయడం జరిగిందని ఇందులో 30 మంది పై కేస్లు నమోదు చేశామని తెలిపారు

ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచనలు విధిగా పాటించి వైరస్ వ్యాప్తి నివారణకు,పోలీసులకు ప్రజల సహకరించాలని ఎస్పీ సింధూ శర్మ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here