Home తెలంగాణ కూరగాయలు పంపిణి చేసిన ఆల్విన్ కాలనీ కార్పొరేటర్

కూరగాయలు పంపిణి చేసిన ఆల్విన్ కాలనీ కార్పొరేటర్

601
0
Allwyn colony corporator

ప్రజా లక్ష్యం (తేదీ ఏప్రిల్ 4) ( కూకట్ పల్లి :- కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్లో కూలీ, నాలీ చేసుకొని బ్రతికేవారికి ఆల్విన్ కాలని డివిజన్ పరిదిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్,యన్.టి.ఆర్ నగర్ కాలనిలోని‌ పేద ప్రజలకు ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ రోజు  కూరగాయలను పంపీణీ చేశారు‌.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్ళలోనుండి బయటకు రాకుండా ఉండటం వలన పేద ప్రజలకు ఆహర ఇబ్బందులు కలగ కుండా వారికి ఆసరాగా నిలుస్తున్నామని,పేదలకు ఎప్పుడూ అండగా నిలుస్తామని ఎవ్వరూ అధైర్యపడవద్దని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్,వార్డ్ సభ్యులు చిన్నోల్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్,ఏరియా కమిటి సభ్యులు వెంకటేష్, మున్నా,పాలమూరు భాస్కర్ రావు,మైనారిటి అధ్యక్షులు సమద్, యూత్ అధ్యక్షులు సుదీర్ రెడ్డి, నాయకులు శివరాజ్ గౌడ్,శశి,నాగభూషణం, మౌలానా,రాంచందర్, వాసు,సంపత్ గారితో పాటు తదితరులు ఉన్నారు.

నూతన రిక్షా ల పంపిణి

ఈరోజు జిహెచ్ యంసి ఆధ్వర్యంలో నూతనంగా అందజేస్తున్న రిక్షాలను ఆల్విన్ కాలని డివిజన్ లోని పారిశుధ్య కార్మికులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పంపీణీ చేశారు. అలాగే కొంత దూరము రిక్షాలను నడిపి జిహెచ్ఎంసి కార్మికులకు అందజేస్తూ కాలనీలలో ఎప్పటికప్పుడు ఇంటింటికీ తిరుగుతూ చెత్తను తీసుకువెళ్ళాలని స్వఛ్ఛ్ హైదరాబాదు నగరం స్వచ్ఛ ఆల్విన్ కాలనీ కొరకు పాటుపడాలని ప్రజలు కూడా వీరికి సానుకూలంగా ఉంటూ చెత్తను రిక్షా కార్మికులు వచ్చినప్పుడు అందులోనే వేయాలని రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని కార్పొరేటర్ ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఐ లింగం‌, వార్డ్ సభ్యులు కాశీనాథ్ యాదవ్, ఏరియా కమిటి సభ్యులు వెంకటేష్, యూత్ అధ్యక్షులు సుదీర్ రెడ్డి, నాయకులు శివరాజ్ గౌడ్,శశి,సంపత్,నాగరాజు గారితో పాటు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here