Home తెలంగాణ బొగ్గు కోసం బారులు తీరిన‌ లారీలు

బొగ్గు కోసం బారులు తీరిన‌ లారీలు

703
0
Lorries lined for coal
Lorries lined for coal

(మేజిక్ రాజా-ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని,అక్టోబర్ 21: విద్యుత్‌ కేంద్రాల్లో తాత్కాలిక బొగ్గు కొరత ఏర్పడి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, దాని ఆధారంగా నడిచే సిమెంట్‌, ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమలు ముందస్తు జాగ్రత్తగా బొగ్గు సమకూర్చుకునేందుకు సింగరేణికి వరస కడుతున్నాయి.

బొగ్గు రవాణా కోసం ఆయా కంపెనీలకు చెందిన వందలాది లారీలు గురువారం ఆర్జీ-2 డివిజన్‌లోని ఓసీపీ-3, ఫేజ్‌-2, సీహెచ్‌పీ వద్ద బారులు తీరాయి. బొగ్గు లోడ్‌ అవ్వడానికి కనీసం 24 గంటల సమయం పడుతోందని లారీ డ్రైవర్లు వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here