(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ సెప్టెంబర్ 7: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోను ద్వారా తెలుపుతారని అన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం లో జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలు ప్రజలు తెలిపినపుడు ప్రాధాన్యమిచ్చి వెంటనే నోటు చేసుకొని వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి వేణు ఫోన్ చేసి కరెంట్ పోల్ నుండి మా ఇంటికి కరెంటు రావడం లేదని ఫిర్యాదు చేయగా, ట్రాన్స్ కో అధికారి 30 మీటర్ల కంటే ఎక్కువ అవసరం ఉన్నందున దానికి అయ్యే ఖర్చు ఎస్టిమేషన్ ఇస్తామని దానికి అయ్యే ఖర్చు మీరే భరించాలని అన్నారు. తిమ్మాపూర్ మండలం గొల్లపెల్లి గ్రామం నుండి ఫోన్ చేసి బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేయగా, కలెక్టర్ స్పందిస్తూ ఎమ్మార్వో పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా డయల యువర కలెక్టరేట్ లో భాగంగా వచ్చిన ఫిర్యాదులు పోలిస్ కమిషనర్, కరీంనగర్ కు 2, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ కు 2, ఎన్ పిడిసిఎల్ కు 2, పంచాయతి అధికారులకు 8, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి 1, అభివృద్ది అధికారికి 1 ఫిర్యాధులు రావడం జరిగింది. మొత్తం ఫిర్యాధులు 24 వచ్చినందున వాటిని సంబంధిత శాఖలు పరిష్కరించాలని అన్నారు. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం నుండి పద్మశ్రీ ఫోన్ చేసి మా నాన్న పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా పేరు మార్పిడి చేసుకున్నారని ఫిర్యాదు చేయగా, కలెక్టర్ వెంటనే కోర్టులో పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గంగాధర మండలం దేశాయిపల్లి నుండి మాలతి ఫోన్ చేసి నా భర్త గర్షకుర్తిలో గ్రామ కార్యదర్శిగా పని చేస్తాడని, అక్రమ సంబంధాలు ఉన్నాయని పోలిస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగటం లేదని ఫిర్యాదు చేయగా, కలెక్టర్ వెంటనే సఖీ సెంటర్ కు వెళ్లి కలవమని చెప్పారు. అతని దగ్గరి నుండి సగం జీతం వచ్చేలా చూస్తామని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఏ. నరసింహా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, ఎల్.డి.యం., జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా విద్యాధికారి, ఏ.డి, ల్యాండ్ అండ్ సర్వే రవింద్ర చారి, సివిల్ సప్లై సురేష్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.