Home తెలంగాణ జిడికే 11 ఇంక్లైన్ ను సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జిడికే 11 ఇంక్లైన్ ను సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

523
0
Minister Koppula Eshwar

గోదావరిఖని (ప్రజాలక్ష్యం ప్రతినిధి) ఏప్రిల్ 10: రామగుండం ఏరియా వన్ పరిధిలోని జిడికే 11 ఇంక్లైన్ ను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. గత మంగళవారం రోజున మొదటి బదిలీలో గనిలోకి విధులకు వెళ్ళిన కార్మికుడు సంజీవ్ ఇప్పటి వరకు కూడా ఆచూకీ దొరక పోవటంతో గనిని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పా ఎస్. చంద్రశేఖర్, రామగుండం ఏరియావన్ జియం కె.నారాయణలు వివరాలు కొప్పుల ఈశ్వర్కు వివరించారు.

గత మంగళవారం నాడు మొదటి షిప్టు విధులు నిర్వహించేందుకు సంజీవ్ గని లోపలి వెళ్ళి తిరిగి రాలేదని తెలిపారు. అతని జాడ కోసం మూడు రోజులుగా రెస్క్యూ బృందాలు ఆన్వేషణ కొనసాగిస్తున్నారని తెలిపారు. అయినప్పతికి అతని ఆచూకి తెలియరాలేదని తెలిపారు. అధికారులు గని వద్దనే వుంటూ ప్రతి నిమిషం కార్మికుని అన్వేషణకు కృషి చేస్తున్న రెస్క్యూ టీములకు సహకరిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సంజీవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడతూ సంజీవ్ జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, జీఎం మరియు ఇతర అధికారులు గని వద్దనే వుండి గని లోపల రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉంటున్నారని తెలిపారు, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. ఏ కొరుకంటి చెందర్, , సేఫ్టీ జీఎం నాగ భూషణ్ రెడ్డి, బల్లల శ్రీనివాస్, మేయర్ అనిల్ కుమార్, టిబిజీకే.ఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, గని ఏజెంట్ ఏ.మనోహర్, టిబిజీకే.ఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్, కాలరీ మేనేజర్ ఏ. నెహ్రూ, పర్సనల్ మేనేజర్ ఎస్. రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here