తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఎమ్మెల్యే కొరకంటి చందర్ గారు మే 7వ తారీకు వరకు లాక్ డౌన్ లో భాగంగా పేద ప్రజలకు అండదండలుగా నిలవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని స్థానిక 33వ డివిజన్లో ఉపాధి లేక వలస కూలీలు ఆకలితో అలమటిస్తుంటే వారికి బి టెక్ స్టూడెంట్స్, విజయమ్మ ఫౌండేషన్ మరియు కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల కు అన్నదాన కార్యక్రమం కోసం బీ టెక్ విద్యార్థులు విజయమ్మ ఫౌండేషన్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించాల్సిన విషయం ఇలాంటి విపత్కర సందర్భాలలో యువకులు ఇలా ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అలాగే తన వంతుగా ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సహకరించిన యువకులకు మరియు అంగన్వాడి టీచర్లకు డివిజన్లోని ప్రజలకు మరియు మహిళలకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అన్నదాతలు బి టెక్ స్టూడెంట్స్ మరియు విజయ ఫౌండేషన్ సభ్యులు, సత్య(చింటూ)పవన్, షన్ను, సింగం శీను సాయి,అభి, సాగర్, వినయ్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు