ఫ్లెక్స్ పై నిషేధం ఉందన్న నేపధ్యం లో దాని ప్రింటర్స్ అందరు ఒక్కటయ్యారు. తెలంగాణ లో వున్న అందరు ప్రింటర్స్ ఏకతాటి పైకి వస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం లేక కుదేలవుతున్నామని ఆందోళనకు గురవుతున్నారు.
50 మైక్రాన్ ల కన్నా తక్కువ ప్లాస్టిక్ పై మాత్రమే నిషేధం ఉందని, ఫ్లెక్స్ 50 మైక్రాన్ ల కన్నా తక్కువ పరిధి లోకి రాదని, ప్రింటర్స్ ఆందోళన చెందవద్దని తీర్మానించారు. ఫ్లెక్స్ అనేది వన్ టైం యూజ్ ప్లాస్టిక్ కాదని , అసలు ఫ్లెక్స్ ప్లాస్టికే కాదని , అది కేవలం ప్రింటింగ్ కు అనుగుణంగా వాడబడే ఒక పాలిస్టర్ క్లాత్ అని, ఈ విషయం ప్రజలకు, మేధావులకు అర్థం అయ్యేలా వివరించాల్సి ఉందని తెలియజేసారు.
ఆదివారము రోజున రాష్ట్ర ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎగ్జ్క్యూటివ్ మెంబెర్స్ సమావేశము హైదరాబాద్ లో జరిగినది . ఈ సమావేశం లో ఫ్లెక్స్ ఒన్ టైం యూస్ ప్లాస్టిక్ పరిధిలోకి రాదని ,దీనిని ప్రతి ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ యజమాని పత్రికల ద్వారా ,ఇంటర్నెట్,ముఖా ముఖిగా ప్రజలకు చేరేవిధంగా విస్తృతంగా తీసుకుపోవాలిసిన అవసరం ఉందని , అలాగే మనకు హైకోర్టు ఇచ్చిన స్టే ను, కె టీ ఆర్ గారు అసెంబ్లీలో ఫ్లెక్స్ పై నిషేధం విధించలేదని తెలిపిన విషయాన్ని మునిసిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లాలని తెలియజేసారు.
ఫ్లెక్స్ ప్రింటింగ్ పని తగ్గినందువలన ప్రభుత్వమే క్లాత్ ప్రింటింగ్ మిషన్ లను సబ్సీడీ పై ఇవ్వవలిసిందిగా ప్రభత్వాన్ని కోరాలని నిర్ణయించారు . తదుపరి సమావేశానికి ప్రతి జిల్లా నుండి కార్యవర్గ సభ్యులు హాజరు అయ్యి వారి సలహాలు , సూచనలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సమావేశం లోరాష్ట్ర అధ్యక్షులు రాజు ,ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ,జాయింట్ సెక్రెటరీ ఎస్ డి ప్రసాద్ మరియు ఖదీర్ , నరేష్ రెడ్డి పాల్గొన్నారు.