సిద్దిపేట నుండి మహారాష్ట్ర లోని సిరొంచ కు కాలినడకతో వెళ్తున్న వలస కార్మికులు ఆకలితో అలిసిపోయి రామగిరి వద్ద ఆగిపోయారు. అటుగా పెట్రోలింగ్ చేస్తూ వెళుతున్న రామగిరి ఎస్ ఐ అర్కటి మహేందర్ గారు వారిని చూసి ఆగి, వారి వివరాలు తెలుసుకొని వారిని స్టేషన్ కు తీసుకొచ్చి వారికి కావాల్సిన భోజనం,మంచినీళ్ల బాటిల్స్,అందిoచి వారి ఆకలి తీర్చారు.
అట్లాగే వారు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని వారికి వాహనంలు ఏర్పాటు చేసి 10 మందిని భద్రంగా పంపించారు.ఇందులో ఏ ఎసై రమేష్, కానిస్టేబుల్ వేణు పాల్గొన్నారు. పోలీస్ వారికీ వారందరు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు.