– 15 నెలల నుంచి వేతనాలు లేవని ఆర్నీల ఆవేదన ..
– మద్దతు ప్రకటించిన సీపీఐ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 3: రామగుండం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీ (రిసోర్స్ పర్సన్స్)లకు 15 నెలల నుంచి వేతనాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం పెద్దపెల్లి జిల్లా ఆర్‌పిల సంఘం అధ్యక్షురాలు కె.శారద ఆధ్వర్యంలో కమిషనర్ ఉదయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. నగరపాలక సంస్థలో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా (మెప్మా)కు అనుబంధంగా పని చేస్తున్న వీరికి గత 15 నెలలుగా వేతనాలు అందడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌పీలకు (రిసోర్స్ పర్సన్) 2018 డిసెంబర్‌లో రూ.4వేలు గౌరవ వేతనం ప్రకటించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. అప్పటినుండి అరు నెలల వేతనం ఇచ్చారని పేర్కొన్నారు. 2019 జూన్ నుండి సెప్టెంబర్ 2020 వరకు పదిహేను నెలల నుండి జీతాలు లేక ఆర్ధికం ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండం నగరపాలక సంస్థలో 130 మందికి పైగా ఉన్న అర్పీలు ఉన్నారని తెలిపారు. వేతనాలు లేక మునిసిపల్ కార్యాలయానికి రావటానికి కూడా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. కమిషనర్ ఉదయ్ కుమార్ స్పందించి సమస్యను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటేషన్ (సిడిఎంఏ) దష్టికి తీసుకెలుతానని తెలిపారు.
ఆర్పీలకు సిపిఐ మద్దతు:
రామగుండం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్పీలకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ సందర్బంగా సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వాలు నూతన పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. వాటిని సక్రమంగా అర్హులైన నిరుపేదలకు లబ్దీ చేకూర్చేందుకు పథకాలను అందే విధంగా ఇంటింటికి తిరుగుతూ సర్వేలు చేస్తూ అగ్రభాగాన ఆర్పీలు నిలుస్తున్నారని తెలిపారు. వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.