– ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్టాంట్ ప్రారంభం
– పేదలకు నమ్మకం కలిగేలా సర్కారు వైద్యం
– రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 3: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతకు శాశ్వత పరిష్కారం చూపెందుకు 85 లక్షలతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ కె.శశాంక, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవి శంకర్, నగర మేయర్ వై.సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే చికిత్స జరుగుతుందనే నమ్మకం కలిగించాలని అన్నారు. ప్రజలలో ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభిస్తుందని ప్రజలలో నమ్మకం కలిగేలా ఆసుపత్రి పనిచేస్తున్నాయని చెప్పారు. కేసిఆర్ కిట్లతో ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా ప్రభుత్వ ఆసు పత్రిలోనే ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమ్మకం లేక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చాలా డబ్బు వధా చేసుకున్నా రని పేర్కాన్నారు. సర్కారు వైద్యం పట్ల పేదలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కరోనా వ్యాధిగ్రస్తులతో పాటు అత్యవసర వైద్య సేవలకు అవసరమైన వారికి ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు 85 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలకు నేరుగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని తెలిపారు. 21 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆక్సిజన్ కొరత ఉండదని మంత్రి తెలిపారు. ఒకేరోజు 2630 మంది పేషెంట్లకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిన వీటి ద్వారా పెట్టవచ్చని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల భవిష్యత్తును దష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
సాధారణ స్థితిలో కోవిడ్:
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలో శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కోవిడ్ ను భయంకరమైన స్థితి నుండి సాధారణ పరిస్థితికి తీసుకురావడం జరిగిందని అన్నారు. జిల్లాలో రికవరీ రేటు 98 నుండి 99 పర్సెంట్ వరకు ఉన్నదని తెలిపారు.
కోవిడ్ పేషెంట్లకు ర్యాపిడ్ యాక్షన్ టెస్టులు చేసి వారిని ఇంటివద్దనే హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి వారికి కావలిసిన మందులు సరఫరా చేసి చికిత్స అందించడం వలన వారు తొందరగా కోలుకునేలాగా చేయగలుగుతున్నామని మంత్రి తెలిపారు.ఇతర వ్యాధులు కారణంగా కోవిడ్ తీవ్రత పెరిగి కొందరు చనిపోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, అడ్మినిస్ట్రేటర్ ఎంపిసి డాక్టర్ అలీం, ఆర్‌ఎంఓ శౌరయ్య తదితరులు పాల్గొన్నారు.