– 24 గంటల పాటు దుర్గాదేవి ఆఖండ శరణుఘోష
– ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావిరిఖని, అక్టోబర్ 8: అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే… రామగుండం నియోజవర్గంలోని రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు దుర్గాదేవి ఆశ్సీస్సులతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమ్మవారిని వేడుకున్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయదుర్గాదేవి అమ్మవారి అఖండ శరణుఘోష ఎమ్మెల్యే చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దైవం పట్ల భక్తిభావం మంచి క్రమశిక్షణ నేర్పు తుందని, జీవితంలో ఉన్నతంగా ఎదుగాలంటే ప్రతి ఒక్కరు భక్తి మార్గాన్ని ఎన్నుకోవా లన్నారు. అమ్మవారి దీవెనలు ఉంటే జీవితంలో ఏదైనా సాధించడంమే కాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు.
సింగరేణి కార్మికులు విధులు నిర్వహించేందుకు గనిలోకి వెళ్లే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్లడం అనవాయితీగా వస్తుందన్నారు. గత 15 సంవత్సరాల కాలంగా అమ్మవారి దీక్షను స్వీకరించడం జరుగుతుందని, నియోజవర్గంలోని ప్రజల బాధలను, కష్టాలను తొలగించి సంతోషంగా ఉండేలా అమ్మవారు దీవించాలన్నారు.
గురువారం ఉదయం 8 గంటల నుండి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అమ్మవారి అఖండ శరణుఘోషతో పాటు శుక్రవారం అమ్మవారి చండీహోమం నిర్వహిస్తామని తెలిపారు.