– కార్పోరేషన్ బీజీపీ అధ్యకుడు బల్మూరి అమరేందర్‌రావు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 8: విద్యార్థి దశ నుంచి ఎబివిపిలో చురుగ్గా పాల్గొంటూ, బీజేపీ అనుబంధ సంస్థలతో పాటు భారతీయ జనతా పార్టీలో క్యాతం వెంకటరమణ చురుకైన పాత్ర పోషించారని రామగుండం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు బల్మూరి అమరేందర్‌రావు అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ బీజేపి నేత క్యాతం వెంకటరమణ రైల్వే బోర్డు యూజర్ సెల్ మెంబర్‌గా నియమితులవడం అభినందనీయమన్నారు.
కాగా తనకు లభించిన ఈ అవకాశంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని క్యాతం వెంకటరమణ తెలిపారు. ఢిల్లీ నుంచి చెన్నై మూడవ లైను ఏర్పాటు , రామగుండం నుండి తాడిచర్ల, భూపాలపల్లి, మేడారం మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ ఏర్పాటు, రామగుండం రైల్వే స్టేషన్‌లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ల నిలుపుదల, గోదావరిఖనికి పుష్ పుల్ ట్రైన్ సాధన కోసం కషి చేస్తానని వెంకట రమణ పేర్కొన్నారు.
అనంతరం రామగుండం బీజేపీ కార్పొరేషన్ కమిటి ఆధ్వర్యంలో క్యాతం వెంకట రమణకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు మామిడి రాజేష్, మారం వెంకటేష్, పురుషోత్తం, డేవిడ్ రాజు, మంచికట్ల బిక్షపతి, రాచకొండ కోటేశ్వర్లు, బూడిద రమేష్, ముప్పు. యాదగిరి,దిగుట్ల. లింగయ్య, నరసయ్య, మహేష్, ప్రతాప్ రాజు, రాజేష్, భరత్, సునీల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.