– కరీంనగర్ కమీషనర్‌గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వి.బి. కమలాసన్‌రెడ్డి
(పత్యేక కథనాలు -2)
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి, కరీంనగర్)
నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో కరీంనగర్ కమీషనరేట్ దేశవ్యాప్తంగా నాల్గవస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ప్రజల భద్రత, రక్షణ కోసం తీసుకంటున్న చర్యలపై నిర్వహించిన సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
జిల్లాల పునర్విభజన తర్వాత కమీషనరేట్ ఏర్పాటు అనంతరం నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం కమీషనరేట్‌లో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘీక శక్తుల కదలి కలను కట్టడి చేసేందుకు కార్డన్ అండ్ సెర్చ్, ఎక్కడ ఏ నేర సంఘటన జరిగినా బ్లూకోల్ట్స్ బృందాలు సత్వరం చేరుకుని సేవలందించడం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం నిరం తరం కొనసాగిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లు, నేరాల నియంత్రణ, ఛేదన కోసం సిసి కెమెరాల ఏర్పాటు, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పోలీస్‌స్టేషన్ల ఆధునీకరణ, కేసుల పురోగతిని తెలియజేసేందుకు సిజిజన్స్”ఫీడ్‌బ్యాక్ డే”, మహిళలు, విద్యార్థినులు పోకిరీల వేధింపుల గురవ్వకుండా ఉండేందుకు షీటీంల బలో పేతం చేయడం ద్వారా సాధ్యమంయింది.

ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా ఎలాంటి సమస్యనైన పోలీసుల దృష్టికి తీసుక వచ్చేందుకు హాక్‌ఐ యాప్, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు స్పెషల్‌డ్రైవ్‌లు, నాఖాబందీలు, రోడ్డు నియమనిబంధనలు, ర్యాగింగ్, మూఢనమ్మకాలు, బాలకార్మికుల విముక్తి కోసం ”ఆపరేషన్ ముస్కాన్”, ”ఆపరేషన్ స్మైల్”, సందర్శక ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కోసం లేక్‌పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యంసేవిండాన్ని నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాల వినియోగం, డయల్ 100 ఫిర్యాదులపై సత్వర స్పందన, పరిష్కారం, నేరాల ఛేదన కోసం ప్రత్యేక విభాగాల ఏర్పాటు లాంటి పలురకాల చర్యలను కమీషనరేట్ పోలీసులు కొనసాగి స్తున్నారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌కు నాల్గవస్థానం లభించడం గర్వకారణం.
పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి ఎంపిక

కరీంనగర్ కమీషనరేట్‌లో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశవ్యాప్తంగా 8వస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2019 డిసెంబర్ 5న కేంద్ర హోంమంత్వ్రశాఖ ఈ ఫలితాలను ప్రకటించి. పోలీ సులు అన్నివర్గాల ప్రజలకు రక్షణ, భద్రత చర్యలు కల్పించడంతో పాటు అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించడం, నేరాల నియంత్రణ, ఛేదనలో తనకంటూ ఒకప్రత్యేక శైలిని కొసాగిస్తూ ముందుకు సాగుతున్న కరీంనగర్ కమీషనరేట్‌లో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశంలో 8వస్థానం సాధించడం గర్వకారణం.

ఈ పక్రియ గతకొన్ని రోజుల నుండి కొనసాగుతున్నా పలురకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సిసిటిఎన్‌ఎస్ అప్ లోడింగ్, మహిళలకు సంబంధించిన నేరాలు, ఎస్‌టి/ఎస్‌సి ల కేసులు, ఆస్థినష్టం కేసులు ఛేదనతోపాటు ప్రోయాక్టివ్, రీయాక్టివ్ చర్యలు, పోలీస్ స్టేషన్‌లో కమ్యూనిటి పోలీసింగ్ కార్యక్రమాలు, అసాంఘీక చర్యలు, పోలీస్టేషన్ భవనం, దివ్యాంగులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశేలా సౌదుపాయాలు ఉన్నాయా? రికార్డుల క్రమపద్దతిలో ఉన్నాయా? ఇవేకాకుండా స్టేషన్‌లో కౌన్సిలింగ్ గదులు, లైటింగ్, పచ్చిక బయళ్ళు, మంచినీటి సౌకర్యం, క్వార్టర్స్, పార్కింగ్ లాంటి అనేక పద్దతిలో సర్వేహించారు.
దానికి ముందు దేశవ్యాప్తంగా 15,666 పోలీస్‌స్టేషనల్‌లలో దేశంలో 77 పోలీస్టేషన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 77లో రాష్ట్రంలో 3వస్థానం పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి ఎంపికై దేశవ్యాప్తంగా పోటీకి అర్హత సాధించింది. ఢీల్లీనుండి పోలీస్‌స్టేషన్లకు వచ్చిన బృందం పోలీసులు ప్రోయాక్టివ్, రియాక్టివ్ చర్యలను పరిగణించడం, టెక్నాలజీ వినియోగంతోపాటు సౌకర్యాలు, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించారు.
గతంలో ప్రజల రక్షణ, భద్రతలో దేశవ్యాప్తంగా నాల్గవస్థానం, పిడియాక్ట్ అమలుతో రెండవస్థానం సాధించిన విషయం విదితమే. అన్నివర్గాల ప్రజల సహకారంతో ఇది సాధ్యమైందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సిసి కెమెరాల ఏర్పాటు:

నేరాల నియంత్రణ, ఛేదనకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వా ములను చేస్తూ కమీషనరేట్ పోలీసులు ముందుకుసాగుతున్నారు. కమ్యూనిటి సిసి కెమెరాలు, నేనుసైతంలో భాగంగా ఇప్పటి వరకు కమీషనరేట్ వ్యాప్తంగా 8500 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. కమీషనరేట్‌లో 50వేల సిసి కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. సిసి కెమెరాల ఫుటేజీల ద్వారా ఇప్పటి వరకు 150పైగా నేరాలను ఛేదించారు. సిసి కెమెరాల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. కమీషనరేట్‌లోని ప్రతి గ్రామంలో 20 సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనరేట్‌లోని జమ్మికుంట, ఇల్లంత కుంట, కేశవపట్నం, గన్నేరువరం, ఎల్‌యండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, రామడుగు, చొప్పదండి పోలీస్‌స్టేషన్లలోని ప్రతిగ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.
అధ్యయన కేంద్రాలుగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్
చిట్టడవుల పెంపకం కేంద్రాలు

కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న మియావాకి పద్దతిలో చిట్టడవుల పెంపకం నేడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు అధ్యయన కేంద్రాలుగా మారాయి. కరీంనగర్‌లోని సిటి పోలీస్ శిక్షణ కేంద్రం(సిపిటిసి), టూటౌన్ పోలీస్‌స్టేషన్, హరితహారంలో భాగంగా గత 2017నుండి నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా అవతరించడాన్ని పరిశీలిస్తూ తమప్రాంతాలలో ఈ విధంగా మొక్కలు నాటి సంరక్షించే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలోని పలుప్రాంతాలకు చెందిన వారు ప్రతినిత్యం కరీంనగర్‌కు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. కమిషనరేట్ పోలీసుల పరిధిలో గత 2017 నుండి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో 55వేలకు పైగా నాటిన మొక్కలు మహావృక్షాలుగా దర్శినమిస్తున్నాయి.

అడ్డూఅదుపు లేకుండా అడవుల నరికివేత ప్రభావంతో మానవమనుగడకు ప్రశ్నార్ధకంగా, ప్రమాదకరంగా మారిన పరిస్థితులపై పరిపూర్ణమైన అవగాహనతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను పెంచి భవిష్యత్‌లో పొంచిఉన్న పెనుప్రమాదాన్ని గుర్తించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి జపాన్‌కు చెందిన వృక్షశాస్త్రవేత్త మియావాకి పద్దతులను అనుసరించి కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చిట్టడవులు పెంపకానికి శ్రీకారం చుట్టారు. మియావాకి పద్దతులను అనుసరించి గతసంవత్సరంలో నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు ఎన్నోవినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సఫలీకృతం అయ్యారు. ఈ మియావాకి పద్దతిలో ప్రస్తుతం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు,

మియావాకి పద్దతిలో పెంచబడుతున్న చిట్టడవులు, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు వాటి సంరక్షణకోసం తీసుకున్న చర్యలపై అధ్యయంనం చేసేందుకు ప్రతినిత్యం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు విచ్చేసి అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(హెచ్‌ఎఫ్‌ఎఫ్) ఆర్ శోభ గత మేనెల 26న చిట్టడవుల పెంపకం, గతంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా ఎదిగినతీరును దర్శించి ఆశ్చర్యకితులయ్యారు.

గతనెల జూన్ 15న జిల్లా కలెక్టర్ కె శశాంక, 22న వరంగల్ చీఫ్‌కన్జర్వేటర్ ఎంజె అక్బర్, 23న జిల్లాలోని యంపిడివోలు, యంపివోలు, 24న జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు, 28న కేశవపట్నం మండలంలోని వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈనెల 03న రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి టి హరీష్‌రావు ఆధ్వర్యంలోని బృందం, ఆమరుసటిరోజే సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కమిషనర్, ఛైర్మెన్, సుడా ఛైర్మెన్లు సందర్శించిన విషయం విదితమే.
దేశపౌరులుగా సగర్వంగా భావించి ముందుకుసాగారు

జీవకోటికి ప్రాణాధారం వనసంరక్షణ. ఆభాద్యతలను విస్మరించి వివిధ రంగాలలో ఎదుగుదలకోసం స్వార్ధంతో పనిచేస్తున్న లక్షలాదిమంది వైపు పయనించకుండా దేశపౌరులుగా దేశభవిష్యత్‌కు మనవంతుగా ఏంచేద్దాం? అనే ఆలోచనతో కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు ముందుకుసాగుతున్నారు. తొలుత కరీంనగర్‌లోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రాంతంలో 2019 సెప్టెంబర్ 19న 02వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆతర్వాత కరీంనగర్‌లోని సిటి పోలీసు శిక్షణ కేంద్రం(సిపిటిసి)లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 03న ఒక ఎకరం విస్తీర్ణంలో 12,500 మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాలు, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. జపాన్‌కు చెందిన వృక్షశాస్త్రవేత్త మియావాకి తక్కువ భూభాగంలో ఎక్కువ మొక్కలు నాటే పద్దతిని కనుగొన్నారు. ఈ పద్దతి ప్రకారం 300గజాల విస్తీర్ణంలో చిన్నపాటి అడవులను తయారుచేయవచ్చని నిరూపించారు.
వనాలను తలపిస్తున్న మొక్కలు

గతంలో వివిధ విడతలుగా జరిగిన హరితహారం, మియావాకి పద్దతిలో సిటిపోలీస్ శిక్షణ కేంద్రం(సిపిటిసి), టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణ, కమీషనరేట్ కేంద్రంలో నాటిన మొక్కలు నేడు వనాలుగా మారాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు పర్యాటకులు వనాల సందర్శనకోసం అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వనాలంటే కరీంనగర్‌కు వచ్చిచూస్తే ఇలా ఉంటాయి అని నిరూపిస్తున్నాయి.
ప్రజలనూ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్నారు

కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు తాము తీసుకుంటున్న వివిధ రకాల చర్యల్లో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. తాము శాంతిభద్రతల విధులకే పరిమితంకాదు ప్రజాహిత కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతుండటంతో అన్నివర్గాల ప్రజలు పోలీసులకు చేయూతనందించేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
కరీంనగర్ పోలీసుల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి మోడల్ ఫారెస్ట్ అమలు

జూలై 21న కరీంనగర్‌కు విచ్చేసిన రాష్ట్ర ఐటి,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు ఇందులో భాగంగా సిటిపోలీస్ శిక్షణ కేంద్రం(సిపిటిసి)లో మియావాకి పద్దతిలో పెంచబడుతున్న చిట్టడవులు, గతంలో జరిగిన హరితహారం కార్యక్రమాల సందర్భంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మొక్కల పెంపకంలో చూపుతున్న శ్రద్దాసక్తులు, అంకితభావంతో చిట్టడవుల పెంపకం, గతంలో జరిగిన హరితహారంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదుగడాన్ని ఆదర్శంగా తీసుకుని ఇదే పద్దతిలో చిట్టడవులు పెంపకాన్ని యాదాద్రి ఫారెస్ట్ మోడల్‌గా నామకరణంచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నామన్నారు. కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో పెంచబడుతున్న చిట్టడవులు, హరితహారంలో మొక్కల సంరక్షణపై వివిధ మిడియాల్లో ప్రచురితం, ప్రసారం అయిన వార్తలను చుదువడం, చూడటం జరిగిందని, నేడు స్వయంగా పరిశీలించి ఆశ్చర్యపోయానని చెప్పారు.
యాదాద్రి మోడల్ మియావాకి ప్రాజెక్ట్-2 ప్రారంభం

Launch of Yadadri Model Miawaki Project.2)
కరీంనగర్‌లోని సిటి పోలీస్ శిక్షణ కేంద్రం(సిటిసి)లో సెప్టెంబర్ 29న నాటిన యాదాద్రి మోడల్ ఫారెస్ట్ మియావాకి ఫారెస్ట్-2ను రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. 1.14ఎకరాల విస్తీర్ణంలో 33రకాలకు చెందిన 14,800మొక్కలను ఈ ప్రాజెక్ట్‌లో నాటారు. ఈ సందర్భంగా మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019లో ఇదే సిటిసిలో ఒక ఎకరం విస్తీర్ణంలో పోలీసులు 17,500మొక్కలను నాటి సంరక్షించి, రాష్ట్రంలో ఇదే తరహాపద్దతిలో మొక్కలను నాటేందుకు యాదాద్రి మోడల్ ఫారెస్ట్‌ను అమలుచేస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మానవమనుగడకు ప్రమాదం పొంచిఉన్న తరుణంలో పోలీస్‌శాఖ వివిధ రకాల పద్దతుల్లో వనాల పెంపకానికి శ్రీకారం చుట్టి సఫలీకృతంకావడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. నాటునాటిన మొక్కలు నేడు వనాలుగా దర్శమివ్వడానికి ప్రధానకారకులు అయిన పోలీస్ కమిషనర్ ఆయన మొక్కల పెంపకం పట్ల చూపిన అమితాసక్తితో భావితరాలకు వనాలుగా ఆస్థులను కరీంనగర్‌కు అందించారని, ప్రభుత్వం తరపున అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. నాడు కాంక్రీట్ జంగిల్‌గా పిలువబడిన కరీంనగర్ నేడు వనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలువడంలో పోలీసుల పాత్ర అమోఘమైందని పేర్కొన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలసాధనకోసం పోలీస్‌శాఖ ముందుకుసాగుతూ సఫలీకృతం అవుతున్నదన్నారు. 2017నుండి హరితహారం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నామని తెలిపారు. 2019లో సిటిసిలో ఒక ఎకరం విస్తీర్ణంలో 17,500మొక్కలు, 2020లో మియా వాకి-2లో 1.14 ఎకరాల విస్తీర్ణంలో 14,800 మొక్కలు, పోలీస్ శిక్షణ కేంద్రం(పిటిసి)లో 25వేల మొక్కలతోపాటు కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్‌శాఖకు సంబంధించిన స్థలాల్లో మొక్కలను నాటుతున్నామని చెప్పారు. రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ నాలుగుసార్లు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించేందుకు నాలుగుసార్లు ప్రత్యక్ష్యంగా వచ్చి పరిశీలించడం, తమవంతు సహకారం అందించడంతో ఉత్సాహం రెట్టించి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ట్రైనీ కాని స్టేబుళ్ళు, వివిధ విభాగాలకు చెందిన పోలీసులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తున్నారని చెప్పారు.