(ప్రజాలక్ష్యం ప్రతినిధి – హైదరాబాద్)
సెప్టెంబర్ 10: హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్రభారతి సమీపంలో కామత్ హోటల్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడ్ని గుర్తించిన స్థానిక పోలీసులు మంటల్ని ఆర్పివేసి ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ గ్రామానికి కు చెందిన నాగులు అని, అతను ఒక ప్రయివేటు టీచర్ గా గుర్తించామని తెలుస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో పాఠశాలలు నడవకపోవడంతో జీవనోపాధి కరువై జీవితం దుర్భరంగా మారినట్లు, తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నాటి నుండి నాకు ఎలాంటి న్యాయం జరగలేదని అతని మాటల ద్వారా తెలిసిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జై తెలంగాణ, కేసిఆర్ సారు అంటూ పెద్దగా అరుపులు పెట్టాడని తెలిపారు. ప్రస్తుతం అతను ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.