Home తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే పరిశ్రమకు తాళం వేస్తా…

స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే పరిశ్రమకు తాళం వేస్తా…

783
0
Dharna
Ramagundam MLA Korukanti Chandar speaking in Dharna

– ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం
– భాజపా నాయకులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
గోదావరిఖని సెప్టెంబర్ 12: స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే ఆర్‌ఎఫ్‌సిఎల్‌ పరిశ్రమకు తాళం వేస్తానని రామగుండం కోరుకంటి చందర్‌ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. శనివారం రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండం ఎరువు కర్మాగారం నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎఫ్‌సిఎలో 11 శాతం పెట్టుబడి పెట్టడం జరిగింది. పరిశ్రమ నిర్మాణం కోసం వీర్లపల్లి, లక్ష్మీపూర్‌ గ్రామాల ప్రజలు తమ భూములు, ఆరోగ్యాలను సైతం త్యాగం చేస్తే స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఆర్‌ఎఫ్‌సిఎల్‌ యాజమాన్యం మొండివైఖరి వ్యవహరిస్తుంది. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ సందర్శన, సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, ముకేష్‌ మండావీయాను పెద్దపల్లి ఎంపి వెంటకటేష్‌ నేతకాని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు అడ్డుకున్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాంటూ నినాదాలు చేశారు.

Dharna
MLA & MP Participating in Dharna

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ… రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శనకు వస్తున్న కేంద్ర మంత్రుకు తమ బాధను, ఇబ్బందును తెలిపేందుకు వీర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు, యువత శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే స్థానిక భాజపా నాయకు కేంద్ర మంత్రుతో మాట్లాడానీయకుండా చేయడం సిగ్గుచేటన్నారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ యాజమాన్యం పర్మినెంట్‌ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేస్తుందన్నారు.

రామగుండం ఎరువు కర్మాగారంలో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత సంవత్సరం ఇక్కడికి వచ్చిన కేంద్ర రసాయనా శాఖమంత్రి సదానందగౌడను అడ్డుకుని నీలదీయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించకుండా ఆర్‌ఎఫ్‌సిఎల్‌ యాజమాన్యం మెండిచెయ్యి చూపిందన్నారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఇప్పటి వరకు 270 పర్మినెంట్‌ ఉద్యోగాలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన 10 మందికి, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలను కల్పించాల్సి ఉండగా యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. స్థానికులకు ఉద్యోగాలను కల్పించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటి మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావు, కార్పోరేటర్లు సాగంటి శంకర్‌, కుమ్మరి శ్రీనివాస్‌, దాతుజిశ్రీనివాస్‌, కోమ్ము వేణుగోపాల్‌, దోంత శ్రీనివాస్‌, అడ్డా గట్టయ్య, శంకర్‌ నాయక్‌, నీల పద్మ-గణేష్‌, బాదె అంజలి-భూమయ్య, క్వచర్ల కృష్ణవేణి-భూమయ్య, బాలరాజ్‌ కుమార్‌, కన్నూరి సతీష్‌ కుమార్‌, ఎన్‌.వి.రమణరెడ్డి, మేక సదానందం, పాముకుంట్ల భాస్కర్‌, జెట్టి జ్యోతి-రమేష్‌, నాయకులు పాతపెల్లి ఎ్లయ్య, బొడ్డు రవీందర్‌, ధరని జపతి, కాల్వ శ్రీనివాస్‌, ర్యాకం వేణు, జే.వి.రాజు, చెరుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్‌ గౌడ్‌, రఫీక్‌, జహీద్‌ పాషా, అచ్చె వేణు, తోడేటి శంకర్‌ గౌడ్‌, ఆడప శ్రీనివాస్‌, చల్లగురుగు మెగిళి, మారుతి, దీటి బాలరాజ్‌, సీరాజోద్దిన్‌, ఇరుగురాల్ల శ్రావన్‌, ముప్పు సురేష్‌, మేక అబ్బాస్‌, బూరుగు వంశీకృష్ణ, మెడం సతీష్‌, మానుపాటి శ్రీనివాస్‌, దేవేందర్‌, పిడుగు కుమార్‌, హరీష్‌, బైరి శ్రీకాంత్‌, చొప్పదండి శ్రీకాంత్‌, అబి, ప్రశాంత్‌, యువరాజ్‌, వికాస్‌, ప్రదీప్‌, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here