– నాణ్యతా వారోత్సవాల ముగింపులో సింగరేణి డైరెక్టర్లు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 18: వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, నాణ్యతే ప్రమాణికమని, నమ్మకమని సింగరేణి డైరెక్టర్లు (ఫైనాన్స్) యన్.బలరాం, (ఇఅండ్‌ఎం) డి.సత్యనారాయణరావు, జీఎం (క్వాలిటీ) కార్పొరేట్ యస్.డి.హబీబ్ తెలిపారు. బుధవారం స్థానిక ఇల్లందు గెస్ట్‌హౌజ్‌లో జరిగిన నాణ్యతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి డైరెక్టర్లు ముఖ్యఅతిథులుగా హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడారు. నాణ్యతకు మొదటి ప్రాదాన్యత ఇచ్చినప్పుడే వినియోగ దారులు బొగ్గు కొనుగోలు చేస్తారన్నారు. విదేశాల నుంచి సరఫరా అయ్యే బొగ్గు తక్కువ రేటుకు నాణ్యతతో వస్తుందన్నారు. దీనికి ధీటుగా ఎదర్కొవాలంటే వ్యయం తగ్గించి నాణ్యతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతా పెంచాలని పేర్కొన్నారు.
బొగ్గు నాణ్యత అవశ్యకతను, నాణ్యత లోపిస్తే జరిగే విపత్కర పరిస్థితిని, నాణ్యతను పెంపొం దించే చర్యలను సవిరంగా వివరించారు. వినియోగదారులకు నాణ్యత విషయంలో ఏ మాత్రం తేడా లేకుండా బొగ్గు సరాఫరా చేయాలన్నారు. అధికారి, సూపర్ వైజర్, ఉద్యోగులు నాణ్యత విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు.
నాణ్యత విషయంలో రాజీ పడకుండా వినియోగదారులకు బొగ్గు సరాఫరా చేయాలని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ సూచించారు. సింగరేణి సంస్థ నుండి వెలికి తీసే బొగ్గు నాణ్యతతో కూడి వుండాలన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణిలోని అన్ని ఏరియాల జియంలు, జియం (క్వాలిటీ) యన్.వి.రాజ శేఖర్, డిజియం (ఇఆండ్‌యం), జియం (క్వాలిటీ) ఆర్జీ రీజియన్ జి.సురేందర్, జియంలు సురేష్, లక్షినారయణ, కొండయ్య, సూర్యనారాయణ పాల్గొన్నారు. యన్.టి.పి.సి జియం రవి కుమార్, టి.యస్. జెన్‌కో యస్.ఇ. వెంకటయ్య, కేశోరాం సిమెంట్ ప్యాక్టరీ నుండి శ్రీహరి, ఎసిసి సిమెంట్, మహా జెన్‌కో, దక్కన్ సిమెంట్ కంపెనీకి చెందిన వినియోగదారులు పాల్గొన్నారు.