(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 10: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా గురువారం ఉదయం నుండి రాత్రి వరకు ఫిర్యాదుదారులకు కేసు పురోగతిని పోలీసు అధికారులు వివరించారు. ఫీడ్‌బ్యాక్ డే పురస్కరించుకొని పోలీసు అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతిని, దర్యాప్తు ఏ దశలో ఉన్నదనే విషయాన్ని పోలీసు అధికారులు ఫిర్యాదుదారులకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కేసు పురోగతిని ఫిర్యాదుదారులకు వివరించడం ద్వారా అపోహలు తొగిపోయే అవకాశం ఉంది. కేసు పురోగతిని వివరించడం ద్వారా కేసు ఏదశలో ఉందో, పోలీసులు ఎలాంటి చర్యులు తీసుకుంటున్నారనే విషయాలపై ఫిర్యాదుదారులకు అవగాహన ఏర్పడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తుల్లో పారదర్శకత పాటించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 398 మందికి కేసు పురోగతిని తెలియజేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఫిర్యాదుదారుకు తమ కేసు ఏదశలో ఉందో తొసుకునే అవకాశం ఉండేదికాదు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు పనితీరు, కేసు దశలను పోలీసు అధికారులే టెలిఫోన్ చేసి తెలియజేస్తుండటం వల్ల ఫిర్యాదుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. ప్రతినెల 10న ఫీడ్‌బ్యాక్ డేను నిర్వహించడం జరుగుతున్నదని పోలీసు అదికారులు తెలిపారు.