– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 16ః రామగుండం నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్ గా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గోదావరిఖని లో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిధి పాల్గొని ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో పరిశ్రమలతో ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సి.యం. కేసిఆర్ నేతృత్వంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి, ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి పై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, గోదావరిఖనిని మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, నగర కమీషనర్ శంకర్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, ఏసిపి గిరి ప్రసాద్, ఆర్జి-1 జిఎం కల్వల నారాయణతో పాటు అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు, పార్టీల, యూనియన్ల అధ్యక్షులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.