పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాలలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళా కు 40 పైగా కంపెనీలు హాజరయ్యాయి. ఈ జాబ్ మేళా కు మూడు వేలకు పైగా నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగమా లేక ప్రైవేట్ ఉద్యోగమా అనేది చూడకూడదని, వృత్తిపై ఉన్న పట్టుదల కసి మాత్రమే కనిపించాలని విద్యార్థులకు తెలియజేసారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వహించిన ఈ జాబ్ మేళా ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ నేను ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తానని ఇచ్చిన మాట తప్పేది లేదని, నా ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నమాట ఈరోజు నెరవేర్చుకున్నని ఆయన అన్నారు. ఇంకా రామగుండం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, ఈ జాబ్ మేళా ను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.