(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంథని, సెప్టెంబర్ 15: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సముద్రాల శ్రీనివాస్ ఎన్నికైయ్యారు. మంగళవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి సముద్రాల శ్రీనివాస్, నలుమాసు ప్రభాకర్ ఇద్దరు పోటీ పడ్డారు. ఆర్యవైశ్య సంఘంలో 610 ఓట్లు వుండగా అందులో 325 ఓట్లు పోలయ్యాయి. అందులో సముద్రాల శ్రీనివాస్‌కు 244 ఓట్లు రాగా నలుమాసు ప్రభాకర్‌కు 81 ఓట్లు పోలయ్యాయి. 163 ఓట్ల మెజార్టీతో సముద్రాల శ్రీనివాస్ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కొంతం వివేక్, ఒల్లాల శ్రీధర్, కుక్కడపు శివప్రసాద్ లు ఎన్నికల అధికారులుగా వ్వవహరించారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్‌కు రావికంటి దామోదర్, ఇల్లందుల కిశోర్, కొమురవెళ్లి రమేష్, కుక్కడపు రామయ్య, చకిలం క్రిష్ణమూర్తి తదితరులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ సభ్యుల సహకారంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి సభ్యునికి అందుబాటులో వుంటానని అన్నారు. కాగా అధ్యక్షుగా ఎన్నికైన శ్రీనివాస్‌కు ఆర్యవైశ్య సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు అభినందనలు తెలియజేశారు.