– కాంట్రాక్టు కార్మికులకు 50లక్షల ప్రమాదభీమా వర్తింపచేయాలి
– సెంట్రల్ లేబర్ యాక్ట్, హైపవర్ కమిటి ప్రకారం వేతనాలు చెల్లించాలి
– అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 9: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన వర్షకాల సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను చందర్ ప్రస్తావించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయిందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 50 లక్షల ప్రమాదబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఓబిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 4గురు కాంట్రాక్టు కార్మికులు మృత్యువాత పడితే వారికి ఎక్స్ గ్రేసియా చెల్లింపులో సింగరేణి యాజమాన్యం, సదరు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. మృతి చెందిన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేసేందుకు 2 రోజులు పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితని ఏర్పడిందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సరైనా వేతనాలు అందండం లేదని, పర్మినెంట్ కార్మికుల కంటే ఎక్కువగా కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించుకుంటు వారికి సరైనా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సెంట్రల్ లేబర్ యాక్ట్, హైపవర్ కమిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు.