– ఆర్జీత్రీ జీఎం సూర్యనారాయణ
(ప్రజాలక్ష్యం కోల్ బెల్ట్ ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 16, ఆరోగ్యంగా జీవించడానికి స్వచ్ఛత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సింగరేణి ఆర్జీత్రీ జీఎం కె.సూర్యనారాయణ అన్నారు. గురు వారం ఓసీపీ-2 బేస్ వర్క్‌షాపు ఆవరణలో స్వచ్ఛతా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ… దేశ అభివృద్ధి పారిశ్రామికాభివృద్ధిపై ఆధారపడి వుంటుందన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా వుంటేనే సంస్థ పురోభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీఎన్సీ క్వార్టర్స్‌లో స్వచ్ఛతా కార్యక్రమం
సింగరేణి ఆర్జీత్రీ పరిధి సెంటినరికాలనీ బంగ్లాస్ ఏరియా, ఎన్.బి.క్వార్టర్స్‌లో స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జీఎం బంగ్లాస్, ఎన్.బి.క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఏపీఏ పర్చేజ్ ఇంజనీర్ పి.డి.సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చుట్టూ వున్న చెత్తతో పాటు ముళ్ల పొదలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని కార్మిక కుటుంబాలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ మారుతి, హౌస్‌కీపింగ్ కార్మికులు పాల్గొన్నారు.