– కారు గుర్తుకు ఓటు వేసీ ఈటెలకు బుద్ధి చెపుదాం…
– కేసీఆర్‌ను విమర్శిస్తున్న ఈటెలకు రాజకీయ సన్యాసం తప్పదు…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(మేజిక్ రాజా – ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జమ్మికుంట, అక్టోబర్ 20ః ఆత్మగౌరవమని విర్రవీగుతున్న ఈటెల రాజేందర్ తన స్వప్రయోజనం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే బీజేపీ పార్టీలో చేరినట్టు, అది అత్మగౌరం కాదని ఆత్మ రక్షణ మాత్రమేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్యులు కోప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో కలిసి బుధవారం జమ్మికుంటలోని 1,2 ధర్మారం, 3 వార్డు రామన్నపల్లె లో టీఆరెస్ రోడ్డు షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం జన్మించిన కారణ జన్యులు సిఎం కేసీఆర్… తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల వర్గాల సంక్షేమం కోసం ఆహర్నిషలకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తన స్వప్రయోజనం కోసం, తన ఆస్తులను కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ ను ఈనెల 30న జరుగనున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని రామగుండం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఎస్సీ, బీసీ, అసైన్డ్ భూములను కబ్జా చేసాడని ఈటెల రాజేందర్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేస్తే, విచారణకు ఆదేశిస్తే, ఈటెల తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి బీజేపీతో కుమ్మక్కై, మధ్యంతర ఎన్నికలు తెచ్చాడని దుయ్యబట్టారు. ఈటెల రాజేందర్ కు రాజకీయ ఓనమాలు నేర్పి రాజకీయ భవిష్యత్ అందించింది కేసీఆర్ అన్నారు. సిఎం పట్ల అసత్య ఆరోపణలు చేస్తే ఘోరి కడుతానని హెచ్చరించారు. ఈటెలను ఉప ఎన్ని కల్లో ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని… రాజకీయ సన్యాసం తప్పదన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు చేసిన మేలేమీలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇల్లూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముభారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ఇలా ఏదో ఒక పథకంలో తప్పక లబ్ధిదారులై ఉంటారని గుర్తు చేసారు. సి.ఎం కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అందుకే కారు గుర్తుకు ఓటు వేసీ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. పేదింటి బిడ్దకు హుజూరాబాద్ ప్రజలంతా అండగా నిలువాలన్నారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు కౌన్సిలర్లు బొంగోని వీరయ్య మారెపల్లి బిక్షపతి రామగుండం కార్పోరేటర్లు పెంట రాజేష్ దొంత శ్రీనివాస్ వైస్ ఎంపీపీ స్వామి సర్పంచ్ ధర్మాజీ కృష్ణ పూట్నార్ మార్కెట్ కమిటీ చైర్మెన్ అల్లం రాజన్న నాయకులు పాతపెల్లి ఎల్లయ్య అడ్ధాల రామస్వామి బోడ్డు రవీందర్ గంగ శ్రీనివాస్ జే.వి.రాజు కాల్వల శ్రీనివాస్ కలువల సంజీవ్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.