(ప్రజాలక్ష్యం విలేకరి-రామగుండం నియోజకవర్గం)
గోదావరిఖని, సెప్టెంబర్ 19: రామగుండం నగరపాలక సంస్థ 9వ డివిజన్ (జనగామ) రామాలయం ఫంక్షన్ హాలులో రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నరసింహమూర్తి శనివారం సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ భూసేకరణ అధికారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో మేడిపల్లి ఓసీపీ, రోడ్డు విస్తరణలో వ్యవసాయ భూములు కోల్పోనున్న పట్టాదారులు, అనుభవదారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్ కుమార్, రామగుండం తహశీల్దార్ తూము రవీందర్, గిర్దవార్ ఫకీరా, ప్రత్యేక భూసేకరణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.