– సింగరేణి 1గ్రూప్ ఆప్ మైన్స్ ఏజెంట్ సురేష్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 6: పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమం కొనసాగుతుందని ఏజెంట్ సురేష్ అన్నారు. భారత ప్రభుత్వం అదేశానుసారం జాతిపిత మహాత్మా గాందీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకుని నీరు, పారిశుధ్యం, పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్వచ్చతా హి సేవా-2020 మాసోత్స వాలలో భాగంగా జీడీకే.2వ గనిలో మంగళవారం స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏజెంట్ సురేశ్, మేనేజర్ సాయి ప్రసాద్ హాజరై ఉద్యోగులతో ప్రతిజ్ణ చేయించారు.
ఈ సందర్బంగా ఏజెంట్ సురేశ్, మేనేజర్ సాయి ప్రసాద్ స్వచ్చతా హి-సేవా ఒక గొప్ప కార్యక్రమమన్నారు. గాంధీ కళలుకన్న స్వచ్చమైన భారత్ నిర్మాణంలో స్వచ్చతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు గుడ్డ సంచులను వాడడం అలవర్చుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ లక్కాకుల లక్ష్మణ్, సేఫ్టీ ఆఫీసర్ దాసరి వెంకటేశ్వర్లు, వెంటిలేషన్ ఆఫీసర్ సల్మాన్‌ఖాన్, సంక్షేమాధికారి కిరణ్ కుమార్, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.