– టీబీజీకేఎస్‌లో చేరిన పలువురు కార్మికులు
– టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 6: సింగరేణి వార్షిక లాభాల నుండి కార్మికుల వాటాను రాబోయే దసరా లోపే ఇప్పిస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకట్రావు తెలిపారు. సింగరేణి ఆర్‌జీ-3 అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెంకట్రావ్ సమక్షంలో పలువురు యువ కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు.
ఈ సందర్బంగా వెంకట్రావ్ మాట్లాడుతూ 2400 మంది బదిలీ వర్కర్లను ఒకేసారి జనరల్ మజ్దూర్‌లుగా ప్రమోషన్లు కల్పించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కుతుం దన్నారు. కార్మికులకు మార్చి నెల 50 శాతం జీతాల్లో కోత ఈ నెల 23న ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి వార్షిక లాభాల నుండి కార్మికుల వాటాను కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ముఖ్యమంత్రిని కలుస్తామని దసరా లోపు లాభాల వాటా కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెంకట్రావ్ తెలిపారు.
ఏరియా ఉపాధ్యక్షుడు గౌతమ్ శంకరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నాయకులు దేవ వెంకటేశం, ఎట్టెం కష్ణ ,పర్ష బక్కయ్య, నాయిని మల్లేష్ ,దేవ శ్రీనివాస్, కాంతాల కిషన్ రెడ్డి, జి శ్రీనివాస్, దాసరి మల్లేష్ ,కొయ్యడ శ్రీనివాస్, వి వి గౌడ్, ఎస్‌ఎస్ రెడ్డి, తిరుపతి, గట్టు శ్రీనివాస్, శేఖరయ్య సారయ్య, గడ్డం రాజేష్ ,చిప్ప సురేశ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.