-ఎంఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 9: పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమం కొనసాగుతుందని మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ అన్నారు. మహాత్మా గాందీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ స్వచ్ఛతా మాసోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో బాగంగానే శుక్రవారం స్వచ్ఛతా హి-సేవా కార్యక్రమాన్ని మేడిపల్లి ఓపెన్‌కాస్టులో నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రాజెక్టు ఆఫీసర్ మాట్లాడుతూ… నీరు, పారిశుధ్యం, పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాన్నారు. స్వచ్చతా హి-సేవా కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగు తుందని తెలిపారు. స్వచ్చతా మాసోత్సవాలు దేశ అభివృద్ధిలో ముఖ్య భూమికను పోషిస్తున్నదన్నారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. గహాలను శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా వుంచుకోవాలని సూచించారు. గుడ్డ సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ణ చేశారు.
ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, మేనేజర్ గోవిందరావు, పిట్ సెక్రటరీ పి.రాంచందర్, సర్వే ఆఫీసర్ మహమద్ అలీ, ఎన్.వి.రావు, సీనియర్ పి.ఒ సారంగపాణి, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.