– బతుకమ్మ చీరల పంపిణీ
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 9: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సద్దుల బతుకమ్మని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్‌తో కలిసి ప్రారంభించి, మహిళలకు చీరలు పంపిణి చేసారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి యేడులాగానే సీఎం కేసీఆర్ ఆడపడు చులకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారని తెలిపారు. పేద ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 317 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు.
రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 287 కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉన్నా యని తెలిపారు. 18 ఏళ్ళు నిండి, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగీ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డిప్యూటీ తాసిల్దార్ సురేష్, కార్పొరేటర్ కాల్వ స్వరూప శ్రీనివాస్ కో ఆప్షన్ సభ్యులు తస్లీమా భాను, డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..