– తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జిల్లా అధ్యకుడు కట్కూరి శ్రీనివాసరెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పెద్దపల్లి, సెప్టంబర్ 12: పెద్దపల్లి జిల్లాలో ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్యాధికారిని తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆశావర్కర్లతో కలిసి వైద్యాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కట్కూరి మాట్లాడుతూ ఈ కరోన కష్టకాలంలో ఆశాలు ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రజలకు సేవలందిస్తున్నారని, కాని వారికి వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1 నుండి 5తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, సర్వే రిజిష్టర్స్ ను ప్రింటింగ్ లో సరఫరా చేయాలని, డెలివరీకి ఎఎన్ఎం ఆశాతో వుండాలని, ఆశాలకు మాస్కులు, సానీటైజర్స్, గ్లౌసులు తదితర కరోనా నివారణ పరికరాలు అందజేయాలని, నెలలో నాలుగు రోజులు పెలవులు కల్పించాలని, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వైద్యాధికారిని కోరారు.