– అవగాహన కల్పించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 11: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మంచిర్యాల, పెద్దపల్లి క్రైమ్ వర్టికల్ సిబ్బందికి ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వర్టికల్ సిబ్బందికి అవగాహన, ట్రైనింగ్, క్రైమ్ డిటెన్షన్ వర్టికల్‌కు సంబంధించి అవగాహన కల్పించారు.
నేర నియంత్రణ, నేర పరిశోధన, నేరస్థులపై నిఘా అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ… శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రాముఖ్యత ఉపయోగం గురించి విశదీకరించారు. కాల్ డేటా రికార్డు అనాలిసిస్ చేయు విధానం, నేర పరిశోదనలో దాని ప్రాముఖ్యత, ఫింగర్ ప్రింట్ డివైసు ద్వారా నేరస్తుల గుర్తింపు, దానిని ఉపయోగించు విదానం, నేర పరిశోధనలో సీపీ కెమెరాల ఉపయోగం, సీసీ కెమెరా పుటేజిని తీసుకొనే విధానం గురించి వివరించారు. వివిధ అప్లికేషన్లు ఉపయోగం గురించిన అవగాహన పెంచారు.
నేరాలలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వాహనాలను గాని, నేరస్తులను విచారించేటప్పుడు పాటించవలసిన నియమాలను గురించి, కేసుల్లోని ప్రాపర్టీని రికవరీ చేసే సమయములో నేరస్తుల పట్ల ఉండావల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేసారు. క్రైమ్ వర్టికల్ చేసే సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులపై, సస్పెక్ట్‌లపై నిఘాను వుంచాలని తెలిపారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయము జరిగే విధంగా చూడాలని చూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వచ్చే కొత్త వ్యక్తులపై సరైన నిఘాను వుంచి నేర నివారణ వర్టికల్‌లో సూచించిన నియమాలను పాటించి సంబంధిత అధికారులకు నేర నివారణలో సహకారం అంధించాలని తెలియజేసారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్న నేపద్యంలో సంబందిత నేరాలు జరుగు పద్దతుల గురించి, వాటి నివారణకు ప్రజలకు కల్పించవలిసిన అవగాహన, నేరం జరిగిన వెంటనే ప్రజలు చేయవలసిన పనుల గురించి ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలనే విషయాల గురించి వివరించారు.
సైబర్ నేరం జరిగిన తరువాత పోలీసులు ఎలా విచారణ జరుపాలనే విధానం గురించి తెలపడం జరిగింది. సిడిఆర్ అనాలసిస్ విధానం నేరం జరిగినప్పుడు దాని ఉపయోగం ఎలా అనే దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఏ.వెంకటేశ్వర్, జి.వెంకటేశ్వర్లు, రమణబాబు, సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్లు ప్రతాప్, స్వామి, సిసిఎస్ ఎస్‌ఐలు, క్రైమ్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.