Home తెలంగాణ కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం దుర్మార్గం…

కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం దుర్మార్గం…

757
0
Journalists Dharna
Journalists doing dharna

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి )
గోదావ‌రిఖ‌ని డిసెంబ‌ర్ 30ః రామగుండం కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించక పోవడం దుర్మార్గమని గోదావరిఖని ప్రెస్ క్లబ్ జ‌ర్న‌లిస్టులు ముక్త‌కంఠంతో ఖండించారు.

గురువారం రోజున రామ‌గుండం కార్పోరేష‌న్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. దానికి మీడియాను అనుమ‌తించ‌లేదు. దాంతో వార్తా సేక‌ర‌ణ‌ను వెళ్లిన‌ జ‌ర్న‌లిస్టులు చంద్ర శేఖర్ రెడ్డి, కె.యస్. వాసు, మాధవ రావు, చంద్ర శేఖర్, అరెల్లి కుమార్ రాజ్ కుమార్, బైరం సతీష్ ల‌తో పాటు త‌దిత‌రులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ ధ‌ర్నా నిర్వ‌హించి కౌన్సిల్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తీరును తీవ్రంగా ఖండించారు.

Journalists Dharna

అనంత‌రం కౌన్సిల్ చ‌ర్య‌ల ప‌ట్ల ప్రెస్‌క్ల‌బ్‌ అధ్యక్షులు వంశీ, ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, కోశాధికారి దయానంద్ గాంధీ మాట్లాడుతూ… పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న మీడియా పై ఆంక్షలు విధించడం, పాలనాపరమైన సమావేశాలకు అనుమతి నిరాకరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశానికి మీడియా హాజరైతే పాలకులకు కలిగే నష్టమేమిటని మండిప‌డ్డారు. ఆంక్షలు విధించడానికి కారణమేమిటని ప్రశ్నించారు.

కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుతించ‌వ‌ద్ద‌ని తెలంగాణ ప్రభుత్వం జీ.వో. కూడా జారీ చేయడం హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ జీ.వో. ను ప్రభుత్వం వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేశారు. మీడియాపై తద్వారా ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడులను జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో ఖండించాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

సీనియర్ జర్నలిస్టులు పిట్టల రాజేందర్, కొల లక్ష్మణ్, మాదాసు రామ్మూర్తి, నాగపూరి సత్యం, పందిళ్ళ శ్యామ్ సుందర్, జక్కం సత్యనారాయణ, రాంశంకర్ త‌దిత‌రులు కౌన్సిల్ తీరును తీవ్రంగా ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here