Home తెలంగాణ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన‌ చట్టం అమలు చేయాలి…

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన‌ చట్టం అమలు చేయాలి…

1164
0
Minimum wages
Ramagundam MLA Korukanti Chandir, who is submitting a petition to enforce the Minimum Wage Act for contract workers to Central Deputy Commissioner

-సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
గోదావ‌రిఖ‌ని, జ‌న‌వ‌రి 19ః కనీస వేతనాల చట్టం ప్రకారం ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందేలా చూడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమీషనర్ ను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ డి. శ్రీనివాసులును ఆయన కార్యాలయంలో కలిసి విన‌తి పత్రాన్ని స‌మ‌ర్పించారు.

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు వేతనాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనాల చట్టం అమలు చేసి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందేలా చూడాల‌ని కోరారు. త్వరలో లేబర్ కమిషనర్ ను కూడా ఈ విషయమై కలుస్తామన్నారు.

minimum wages
Ramagundam MLA Korukanti Chandir talks to Central Deputy Labor Commissioner to enforce minimum wage law for NTPC contract workers

ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కాగా ఈ విష‌యంలో స్పందించిన డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసులు రాష్ట్ర లేబర్ కమిషనర్ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లి గెజిట్ చేయించినట్లయితే, అమలు చేసే విధంగా తాము చర్యలు చేపడతా మన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పెద్దపల్లి కాంట్రాక్టు మల్టిపుల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇజ్జగిరి భూమయ్య (టిఆర్ఎస్), ఏఐటీయూసీ అనుబంధ సంఘ నాయకులు మహదేవుని శంకర్, రెటపాక లక్ష్మణ్, రాజయ్య, రాజేష్ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here