ఎస్సారెస్పీలో వ్యక్తి గల్లంతు...
- ఆచూకీ కోసం ఈతగాళ్లతో వెతికించిన ఎస్సై….

ముప్కాల్, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వృత్తి రీత్యా చేపల వేటకు వెళ్లిన వ్యక్తి అదృష్యమైనట్లు ముప్కాల్ ఎస్సై తెలిపారు. వివరాల ప్రకారం నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ముప్కాల్ కు చెందిన అనికేషి లావణ్య w/o రమేష్ వయస్సు(35) ముప్కాల్ గ్రామ నివాసురాలు పిర్యాదు ఏమనగా తన భర్త అగు అనికెషి రమేశ్ s/o లక్ష్మణ్ వయస్సు(46 ) కులం గూండ్ల, బతుకు తెరువు కోసం వృత్తి పని ఐనా చేపలు పట్టడం చేస్తాడు. ఎప్పటిలాగానే నిన్న అనగా తేదీ 04.02.2024 మధ్యాహ్నం 3 గంటలకు ముప్కాల్ గ్రామ శివారు నందు ఎస్సారెస్పీ డామ్ కు వెళ్ళాడు. కానీ తన మర్ధి ఐనా శ్రీనివాస్ ద్వారా తెలిసినది ఏమనగా తన భర్త రమేష్ చేపలు పడుతూ 5 గంటల ప్రాంతంలో తెప్ప పైన నుండి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోనాడు. నీటిలో కొద్ది దూరం లో ఉన్న శ్రీనివాస్ మరియు గంగాధర్ మరీ కొందరు అరుపులు అరుస్తూ తన దగ్గరికి వెళ్ళేసరికి కనపడకుండా పోయాడు. కావున తెప్ప పైన చేపలు పడుతూ ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ డామ్ లో పడిపోయి కనపడకుండా వెళ్లిన తన భర్త ఆచూకీ తెల్పగలరని పిటిషన్ ఇవ్వగ వెంటనే ఎస్ఐ ముప్కాల్ మిస్సింగ్ కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మిస్ ఐనా మనిషి కోసం గజ ఈతగాళ్లు నిన్న సాయంత్రం చీకటి పడేవరకు వెతకడం జరిగింది. ఈ రోజు అనగా 05.02.2024 కూడ సాయత్రం వరకూ వెతికినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. నీటి లోతు ఎక్కువ ఉండడం మరియూ డ్యాం మధ్యలో కావడం వలన ఆచూకీ కష్టం అవుతుంది అనీ ఈతగాళ్లు చెప్పారని ఎస్సై చెప్పడం జరిగింది.