అత్యాధునిక సాంకేతికతతో జీర్ణవ్యవస్థ, కాలేయ వ్యాధులకు సమగ్ర చికిత్స.
మహబూబాబాద్ ప్రజలకు అందుబాటులో యశోద హాస్పిటల్స్ నిపుణుల సేవలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మహబూబాబాద్ టౌన్, జూలై 21:జీర్ణవ్యవస్థ, కాలేయం, ప్యాంక్రియాస్, పిత్తనాళాలకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. వినోద్ రెడ్డి రామన్ తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని ధరణి హాస్పిటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ విభాగంలో ఎండోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (ఈయూఎస్), ఈఆర్‌సీపీ, థర్డ్-స్పేస్ ఎండోస్కోపీ, ఈఎస్‌డీ, పీఓఈఎం, ఏఆర్‌ఎంఏ వంటి ఆధునిక వైద్య విధానాల ద్వారా క్లిష్టమైన జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చిన్నపేగు వ్యాధుల నిర్ధారణకు క్యాప్సూల్ ఎండోస్కోపీ, బెలూన్ ఎంటెరోస్కోపీ, కాలేయ వైఫల్య బాధితులకు ప్లెక్స్ చికిత్స, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ప్రత్యేక ఇన్‌ఫెక్షన్లకు ఎఫ్‌ఎమ్‌టీ (ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్) వంటి ఆధునిక చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), జీర్ణాశయ రక్తస్రావం, ప్యాంక్రియాటిక్, బిలియరీ వ్యాధుల చికిత్సలో అనుభవజ్ఞులైన నిపుణుల బృందం సేవలందిస్తోందన్నారు.
సింగరేణి, రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ ఆరోగ్య బీమా (ఇన్సూరెన్స్) పథకాల ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు ఈ ఆధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డా. వినోద్ రెడ్డి రామన్ కోరారు.