Take a fresh look at your lifestyle.

కార్పొరేషన్లలో కుమ్మరులకు దక్కని చోటు…..

0 1,254

కార్పొరేషన్లలో కుమ్మరులకు దక్కని చోటు

  • ఆర్థికంగా వెనుకబడడమే గుర్తింపు లేకపోవడానికి కారణమా…

  • సమాజంలో వ్యక్తి పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసే వరకు కుమ్మరి కుండ అవసరమే

కామారెడ్డి జిల్లా కామారెడ్డి , మార్చి 13  ( లోకంతీరు )  : మనిషి పుట్టుక నుండి మట్టిలో కలిసే వరకు కుండ లేనిది ఏ పని చేయరాదు చేయలేరు. అలాంటి కుండలు చేసే వారికి సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది. రాజకీయ నాయకులైన, సామాన్య వ్యక్తులైన, ఉద్యోగులైన ఎవరైనా కుండ గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోశక్తి కాదు. అయినప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం 16 కులాలకు కార్పొరేషన్లు కేటాయించి కుమ్మర కులస్తులకు కార్పొరేషన్ కేటాయించకపోవడం కుమ్మరులను అవమానించినట్లే అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. మనిషి పుట్టినప్పుడు మాయమంత నుండి మృతి చెంది కాటిలో కాల్చేటప్పుడు సైతం ఆ కుండతో నీరు పోసే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అంతటి ప్రాముఖ్యత గల కుండలు తయారు చేసే కుల వృత్తి చేసే కుమ్మర్లకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని పలువురు కుమ్మరులు పేర్కొంటున్నారు. వివిధ కులాలకు మూడు రకాలుగా విభజించి, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మూడు ప్రత్యేక కార్పొరేషన్లు, ఏ ఒక్క దాంట్లో కుమ్మరులను చేర్చకపోవడం కుమ్మర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవమానించినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ కుమ్మరులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమ్మరి రాములు కోరుతున్నారు.
మంత్రి మండలి ఆమోదించిన కార్పొరేషన్లు
1.ముదిరాజ్ కార్పోరేషన్,
2.యాదవ కుర్మ కార్పోరేషన్,
3.మున్నూరు కాపు కార్పోరేషన్,
4.పద్మశాలి కార్పోరేషన్,
5.పేరిక (పురగరి క్షత్రియ ) కార్పోరేషన్ 6. లింగాయత్ కార్పోరేషన్, 7. మేర కార్పోరేషన్, 8. గంగపుత్ర కార్పోరేషన్,
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, 9. ఈబీసీ ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు,
10. ఆర్య వైశ్య కార్పోరేషన్,
11. రెడ్డి కార్పోరేషన్,
12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పోరేషన్,
13. మాల, మాల ఉప కులాల కార్పోరేషన్,
మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు,
14.ఆదివాసీ కార్పోరేషన్ (కొమురం భీం),
15.సంత్ సేవాలాల్ లంబాడీ కార్పోరేషన్,
16.ఏకలవ్య కార్పోరేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈ విధంగా కేటాయించింది.
మమ్మల్ని గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – కామారెడ్డి కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కులాలకు కార్పొరేషన్ కేటాయించి మా కులానికి కార్పొరేషన్ కేటాయించకపోవడంతో మా కులం అభివృద్ధి ఇప్పటికే వెనుకబడిపోయింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా కుమ్మర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము ఆర్థికంగా ఎదగడానికి సహకరించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.