ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా…?

రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామంలో చాతర బోయిన పెద్ద గంగారాం నివాసిత గృహంపై 11 కెవి విద్యుత్, అదేవిధంగా గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ తీగలు చేయి లేపితే తగిలే విధంగా ప్రమాదకరంగా ఇంటిపై వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదానికి పరాకాష్ట అయిన పట్టింపు లేని విద్యుత్ సిబ్బంది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన, రాతపూర్వకంగా దరఖాస్తు చేసిన పట్టించుకునే వారే లేరు. తద్వారా విద్యుత్ తీగలతో ఇంటికి వర్షాకాలం లో గోడలకు అర్థింగ్ రావడం వలన షాక్ తగులుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేగాక ఇంటిలో ఉన్న టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్, లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు విద్యుత్ ఘాతంతో పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఇంటి పైనే వేలాడుతున్న తీగలు ఇంటి పైకి వెళ్లడానికి కూడా భయంగా విద్యుత్ తీగలు, ఇకనైనా అధికారులు స్పందించి ఇంటి పై ఉన్న విద్యుత్ తీగలను తొలగించ
వలసిందిగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.