రుణమాఫీ అయిన లబ్ధిదారుల ఇంటింటా సర్వే

కామారెడ్డి జిల్లా / భిక్కనూర్, ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారిణి రాధారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల రుణమాఫీ పొందిన లబ్ధిదారుల ఇంటింటి సర్వే ను చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని రుణమాఫీ పొందినవారి రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు లేని కుటుంబ సర్వే, వారి వివరాలను నమోదు చేసుకున్నామని తెలిపారు. అలాగే రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినోద్, తదితరులు పాల్గొన్నారు.