Take a fresh look at your lifestyle.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

0 1,292

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– తోట కరుణాకర్ దివ్యంగుల సమితి అధ్యక్షులు

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలో బాగా వర్షాలు కురుస్తున్న గ్రామ ప్రజలు.నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం వల్ల ప్రయాణ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో నడపాలని, అతివేగం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు.చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు.అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటుస్థంభాలు,ట్రాన్సాపార్మర్స్, ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్ద కు వెళ్ళరాదన్నారు.నది,నీటి వాగుల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపవద్దని చెప్పారు.ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.