సదాశివ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్
– ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు కృతజ్ఞతలు
– ఎండి రావుఫ్

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ రామారెడ్డి మండల ప్రజలకు డైరెక్టర్ గా ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది అన్నారు. సదాశివ నగర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపిన రావూఫ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి, ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి అప్పగించినందుకు గర్వంగా ఉందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పనిచేసే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కచ్చితంగా ఫలితం ఉంటుందని గుర్తు చేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ప్రజల శ్రేయస్సు కై పనిచేస్తున్నాడని తెలిపారు. నన్ను నమ్మి ఈ పదవి అప్పగించినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.