చిన్నారుల కిడ్నాప్ కేసులకు సంభంధించి….
-
తప్పుడు సమాచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు.
-
కిడ్నాపర్లుగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు
– నగర కమిషనర్ కల్మేశ్వర్.

నిజామాబాదు , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన మూడు కిడ్నాప్ జరగగా, కిడ్నాపర్స్ ని పట్టుకొని విచారించడం జరుగుతుందని, కిడ్నాప్ అయినటువంటి పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియజేశారు .చిన్నారుల కిడ్నాప్ కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో ఫేస్బుక్ ,వాట్సప్, ట్విట్టర్ ,యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయం తమ నోటీసుకు వచ్చింది కాబట్టి, అనుమానితులను విచారిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు తెలిసింది అన్నారు. అలా చేస్తే చట్టపరంగా కఠినమయిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో గాని లేక డయల్ 100 కు గాని సమాచారం అందించాలని తెలిపారు.