Take a fresh look at your lifestyle.

గణేష్ ఉత్సవాలు ప్రశంతంగా జరుపుకోవాలి…

0 1,353

గణేష్ ఉత్సవాలు ప్రశంతంగా జరుపుకోవాలి

 – హాజరైన కామారెడ్డి డిఎస్పీ, భిక్నుర్ సిఐ

కామారెడ్డి జిల్లా /రాజంపేట,  సెప్టెంబర్ 04  ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బుధవారం స్థానిక ఎస్సై పుష్ప రాజ్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు, భిక్కనూర్ సిఐ సంపత్ కుమార్ శాంతి భద్రత విషయంలో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని యువజన సంఘ సభ్యులకు, వినాయక మండపాల నిర్వాహకులకు తెలియజేసారు. భిక్కనూర్ సీఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ యువజన సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు సామరస్యంగా నిమజ్జనం చేయాలని కోరారు. కామారెడ్డి డి ఎస్ పి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి సహకరించి ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని డి ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పోలీసు సిబ్బంది, తహసిల్దార్ అనిల్ కుమార్, విద్యుత్ శాఖ ఏ ఈ మారుతి, ఎంపిడిఓ రాజేశం, గ్రామ పెద్దలు, గణేష్ మండపాల నిర్వహకులు, యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.