Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి…

0 1,434

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి

– సిఐటియు డిమాండ్
– సిఐటియు నాయకుడు ప్రభాకర్

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధాలు మానుకోవాలని సిఐటియు ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్లు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం తిరిగిందని, ఆశ వర్కర్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర ,జిల్లా కార్యదర్శి రాజశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్ పర్మినెంట్ చేస్తానని మోనో పోస్ట్ లో పెట్టడం ఆశ వర్కర్లను అవమానించడం అన్నారు. ప్రజా పాలన పేరు తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటుతున్న ఆశా కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, ఆశ వర్కర్ల పట్ల చిన్న చూపు చూస్తుంది కనీస గౌరవ వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని, పి ఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలతో అదనంగా పనులు చేయించవద్దని అధికారుల ఒత్తిళ్లు మానుకోవాలని ఆశ వర్కర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆశ వర్కర్లు 24 గంటలు పని చేస్తున్న వారికి అదనంగా బత్యం చెల్లించాలని,కరోనా టైంలో ప్రజలంతా ఇంట్లోకి పరిమితమైన ఆశ వర్కర్లు మాత్రం ప్రజలకు సేవ చేసి ప్రజలను కాపాడిన చరిత్ర గుర్తించి ఇండియన్ గ్లోబ్ సంస్థ పంచ ఆరోగ్య ఆశా వర్కర్లకు అవార్డు ప్రకటించిందని గుర్తు చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్ల పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. ఇప్పటికైనాఆశ వర్కర్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియూ గా ఆధ్వర్యంలో పోరాటాలు, చేస్తామని ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని వారి డిమాండ్ చేశారు.ఈ కార్యకర్తలో నాయకులు మంజుల. పద్మ. రేణుక. గంగామణి. సుధా. భాగ్యలక్ష్మి. ప్రమీల. లలిత 350 మంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.